AP Tenth Board Exams 2025 : పదో తరగతి విద్యార్థులకు బోర్డు అలెర్ట్.. ఈ పరీక్ష తేదీలో మార్పు.. విద్యాశాఖ క్లారిటీ!!

సాక్షి ఎడ్యుకేషన్: ఏపీ పదో తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్ష షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం, మార్చి 17, 2025 న పరీక్షలు ప్రారంభమై మార్చి 31వ తేదీన ముగియనుంది. కాని, ఈ షెడ్యూల్‌లో చిన్న మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని బోర్డు ప్రకటించింది. తాజాగా సబ్జెక్టుల వారీగా పబ్లిక్ పరీక్షల తేదీలతో రివైజ్‌డే ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది ఏపీ విద్యాశాఖ.
Tenth Public Exam Fees : టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు గడువు పెంపు.. ఈ తేదీలోగా!
చివరి పరీక్ష ఎప్పుడు..!!
విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మార్చి 31న చివరి పరీక్ష జరగాలి. కానీ, అదే రోజు రంజాన్ ఉండి, అది సెలవు దినంగా ఏపీ ప్రభుత్వ క్యాలండర్‌లో పేర్కొన్నారు. ఒకవేళ పండుగ సందర్భంగా నెలవంక కనుక మార్చి 31న కనిపిస్తే అదే రోజు రంజాన్ జరుపుకుంటారు. అప్పుడు అదే రోజును సెలవుగా కూడా ప్రకటిస్తారు. అయితే ఒకవేళ ఆ రోజు సెలవు ఉంటే మాత్రం పరీక్షను వాయిదా వేయాల్సిందే. ఇక వాయిదా పడే ఈ చివరి పరీక్షను ఏప్రిల్ 1వ తేదీన నిర్వహిస్తారని విద్యాశాఖ తాజా ప్రకటనలో పేర్కొంది.
విద్యార్థులకు గమనిక..
విద్యార్థులు ఈ విషయాన్ని తెలుసుకొని, జాగ్రత్త పడాలని విద్యాశాఖ తెలిపింది. వారి పరీక్షలకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా, ప్రతీ పరీక్షకు వచ్చే సమయాన్ని వినియోగించుకొని ప్రతీ పరీక్షకు సిద్ధంగా ఉండి బాగా రాయాలని కోరారు.
పరీక్ష షెడ్యూల్..
17-03-2025 (సోమవారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ గ్రూప్ ఏ - 9.30 నుంచి 12.45 వరకు
17-03-2025 (సోమవారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్ - 9.30 నుంచి 12.45 వరకు
19-03-2025 (బుధవారం) - సెకండ్ ల్యాంగ్వేజ్ - 9.30 నుంచి 12.45 వరకు
21-03-2025 (శుక్రవారం) - ఇంగ్లీష్ - 9.30 నుంచి 12.45 వరకు
22-03-2025 (శనివారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్స్ - 9.30 నుంచి 11.15 వరకు
22-03-2025 (శనివారం) - OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) - 9.30 నుంచి 12.45 వరకు
24-03-2025 (సోమవారం) - మ్యాథమేటిక్స్ - 9.30 నుంచి 12.45 వరకు
26-03-2025 (బుధవారం) - భౌతికశాస్త్రం (ఫిజిక్స్) - 9.30 నుంచి 11.30 వరకు
28-03-2025 (శుక్రవారం) - జీవశాస్త్రం (బయోలజీ) - 9.30 నుంచి 11.30 వరకు
29-03-2025 (శనివారం) - OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) - 9.30 నుంచి 12.45 వరకు
10th Class: ‘టెన్త్ విద్యార్థులకు లాంగ్వేజ్ అభ్యసన దీపికలు ఇవ్వాలి’
29-03-2025 (శనివారం) - SSC ఒకేషనల్ కోర్స్ (థియరీ)- 9.30 నుంచి 11.30 వరకు
మార్చి 31 లేదా ఏప్రిల్ 01 - సాంఘీక శాస్త్రం (సోషల్ స్టడీస్) - 9.30 నుంచి 12.45 వరకు
ఏపీ పదో తరగతి విద్యార్థులకు ప్రకటించిన తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. ఫిజిక్స్, బయాలజీ పేపర్లు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు నిశ్చింతగా ప్రతీ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ap tenth exams 2025
- schedule changes
- ap tenth students
- AP education department
- tenth board
- Tenth Students
- ap tenth board exams schedule
- ap education minister clarity
- march 31st holiday
- tenth public exams dates 2025
- ap tenth public exams schedule
- march 31st
- ap tenth public exams dates
- april 1st
- social exam postpone for ap tenth students
- Education News
- Sakshi Education News
- BoardExamSchedule
- APBoardExam