Skip to main content

AP Tenth Exams Fees : ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫీజుకు వేళాయె.. విద్యార్థులు చెల్లించాల్సిన రుసుము వివ‌రాలు!

మార్చి, ఏప్రిల్‌లో నిర్వ‌హించ‌నున్న టెన్త్ బోర్డ్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజు వివ‌రాల‌ను ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు..
AP tenth class board exam fees details

రాయవరం: విద్యార్థి జీవితంలో తొలి పరీక్ష పదో తరగతి గట్టెక్కడం. ఈ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న రెగ్యులర్‌/ఫెయిల్‌ అయిన అభ్యర్థులు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పరీక్ష ఫీజు చెల్లింపు వివరాలు ఇలా..

అపరాధ రుసుం లేకుండా వచ్చే నెల 11వ తేదీలోగా పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు. ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు నవంబరు 11వ తేదీలోగా నామినల్‌ రోల్స్‌ పూర్తి చేసిన తర్వాత స్కూల్‌ లాగిన్‌లోని లింక్‌ ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా కాని, చలానా ద్వారా కాని పరీక్ష ఫీజు చెల్లిస్తే నిరుపయోగమవుతుంది. మాన్యువల్‌ నామినల్‌ రోల్స్‌ (ఎంఎన్‌ఆర్‌) నేరుగా సంబంధిత డీఈవో కార్యాలయంలో సబ్మిట్‌ చేయాలి. వచ్చేనెల 12 నుంచి 18వ తేదీలోగా రూ.50 అపరాధ రుసుంతో ఫీజు చెల్లించవచ్చు.

Mann Ki Baat: దేశంలో పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు.. ‘డిజిటల్‌ అరెస్టు’కు భయపడొద్దు అని చెప్పిన మోదీ..

19నుంచి 25వ తేదీ లోగా రూ.200 అపరాధ రుసుంతో చెల్లించేందుకు అవకాశం ఉంది. ఇక 26 నుంచి 30వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుంతో ఫీజును చెల్లించవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రికగ్నిషన్‌ పెండింగ్‌ ఉన్న పాఠశాలల ఆన్‌లైన్‌ లాగిన్లను ఎనేబుల్‌ కాలేదు. రికగ్నిషన్‌ పెండింగ్‌ ప్రక్రియను పూర్తి చేసుకున్న పాఠశాలలు సంబంధిత డీఈవో కార్యాలయంలో సంప్రదించి, లాగిన్‌ను ఎనేబుల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. కాగా పైన పేర్కొన్న తేదీల్లో ఏవైనా సాధారణ సెలవు దినాలుంటే తర్వాత పనిదినం రోజున కూడా ఫీజు చెల్లించుకోవడానికి అనుమతిస్తున్నారు.

పరీక్ష ఫీజు ఇలా

రెగ్యులర్‌ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాలని, ఫెయిలైన అభ్యర్థులు మూడు లేదా అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ.110, మూడు లేదా అంతకన్న ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులు, ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఫీజు రూ.125కు అదనంగా మరో రూ.60 చెల్లించాలని ఆయన సూచించారు. తక్కువ వయసున్న విద్యార్థులు (అండర్‌ ఏజ్‌ స్టూడెంట్స్‌) ఫీజుగా రూ.300 చెల్లించాలి.

Lavudya Devi: డాక్టర్‌ చదువుకు డబ్బుల్లేక.. కూలి పనులకు.. సీటొచ్చినా.. ఫీజు కట్టలేని అడవి బిడ్డ

చైల్డ్‌ విత్‌ స్పెషల్‌ నీడ్‌ (సీడబ్యుఎస్‌ఎన్‌) విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించనవసరం లేదు. సదరమ్‌ సర్టిఫికేట్‌ లేని వారు సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం పంపించిన ఫార్మాట్‌లో సివిల్‌ సర్జన్‌ వైద్యుడు ధృవీకరించి సబ్మిట్‌ చేసే వీలును ప్రభుత్వం కల్పించింది. ఆన్‌లైన్‌ ధరఖాస్తులు www.bre.ap.gov.in వెబ్‌సైట్‌ నందు అందుబాటులో ఉన్నాయి. పూర్తి చేసిన దరఖాస్తులు అన్నీ ఆన్‌లైన్‌లోనే సబ్మిట్‌ చేయాల్సి ఉంది.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

హెచ్‌ఎంలే బాధ్యత వహించాలి

నామినల్‌ రోల్స్‌ సబ్మిట్‌ చేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలి. చిన్న తప్పు దొర్లినా సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నామినల్‌ రోల్స్‌ను ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని మాత్రమే సబ్మిట్‌ చేయాలి.

– ఎన్‌.సురేష్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం, అమలాపురం

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు

పదో తరగతి పరీక్ష ఫీజుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. ఎక్కడైనా అధికంగా వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఫీజు చెల్లింపు సమయంలో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ సూచించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

– జి.నాగమణి, ఆర్‌జేడీ, కాకినాడ

Published date : 28 Oct 2024 04:08PM

Photo Stories