బీసీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు.. 6,600 సీట్లు.. ఎంపిక విధానం ఇలా!

మొత్తం సీట్ల సంఖ్య: 6,600.
అర్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నాలుగో తరగతి 2024–25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.
వయసు: ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు 11 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 12 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ(అనాథ /మత్స్యకార)ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులు నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నాపత్రం తెలుగు/ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:15.03.2025
పరీక్ష కేంద్రం: విద్యార్థుల సంబంధిత జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://mjpapbcwreis.apcfss.in
>> Free Education: డా.బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో బీఆర్‌ఏజీ సెట్–2025.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() |
![]() ![]() |
