Top Tips to Score High in SSC Exams: పదో తరగతి పరీక్షల్లో టాప్ స్కోర్ చేయాలా? సబ్జెక్టుల వారీగా స్టడీ ప్లాన్..

సబ్జెక్టుల వారీగా వెయిటేజీ:
సోషల్ ఆ మ్యాప్స్ తప్పనిసరి..
నూతన విధానంలో పటాలకు 15 మార్కుల వెయిటేజీ ఉంటుంది. చరిత్ర నుంచి ఒకటి, రెండు పాఠ్యాంశాల్లోని పటాలు, భూగోళం నుంచి 6, 7 పాఠ్యాంశాల్లోని పటాలు చదవాలి. పటాల గుర్తింపు విషయంలో చరిత్రలో 3, 5, భూగోళంలో 1, 6, పౌరశాస్త్రంలో 4, 5, అర్థశాస్త్రంలో 3వ పాఠం అత్యంత ప్రధానమైనవి. 8 మార్కుల ప్రశ్నల విషయానికి వస్తే భూగోళంలో మూడు నాలుగు పాఠాల్లో విషయ అవగాహన కింద వస్తాయి. చరిత్రలో 2, 5 పాఠ్యాంశాల నుంచి అకడమిక్ స్టాండర్డ్–2 కింద ప్రశ్నలు ఇస్తారు. పౌరశాస్త్రంలో ప్రజాస్వామ్యం పాఠ్యాంశం నుంచి సమకాలీన అంశాల్లో ప్రతిస్పందన (అకడమిక్ స్టాండర్డ్–4) అనే అంశంపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అర్థశాస్త్రంలో పట్టికలు, గ్రాఫ్‌లపై విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తాయి. పరీక్షలలో భారతదేశం మరియు ప్రపంచ పటం రెండు అవుట్‌లైన్ మ్యాప్‌లను తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుంది.
– కేఎస్‌వీ కృష్ణారెడ్డి, పాఠ్య పుస్తక రచయిత, జెడ్పీహెచ్‌ఎస్, ఈతకోట, రావులపాలెం మండలం
హిందీ చుట్టీ పత్ర్ ..
ద్వితీయ భాష హిందీ పరీక్ష పత్రం 6 విభాగాలుగా ఉంటుంది. ఆ విభాగాల నుంచి 100 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. మొదటి భాగం నుంచి 12 మార్కులకు పాఠ్య పుస్తకంలోని వ్యాకరణ అంశాలు బాగా ప్రాక్టీస్ చేయాలి. భాగం–2లో కాంప్రహెన్షన్ నుంచి 4 పేరాగ్రాఫ్‌లు ఇచ్చి ఒక్కో పేరాగ్రాఫ్‌కు 5 మార్కుల చొప్పున 20 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. పేరాగ్రాఫ్‌లను చదివి బాగా అర్థం చేసుకుని రాయాలి. భాగం–3లో కవి, రచయితల గురించి బాగా చదివి అవగాహన పెంచుకుంటే 10 మార్కులు పొందవచ్చు. 19వ ప్రశ్నగా ‘దోహా’ మొదటి పాఠం నాలుగు పద్యాల్లో ఒకటి ఇస్తారు. లేఖలో చుట్టీ పత్ర్ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది.
– తాహెర్ పాషా, పాఠ్య పుస్తక రచయిత, జెడ్పీహెచ్‌ఎస్ (బాలికలు), రాజోలు
భౌతికశాస్త్రం.. భయం వద్దు
ఫిజిక్స్‌లో మొత్తం 8 పాఠ్యాంశాల్లో నాలుగు ఫిజిక్స్, నాలుగు కెమిస్ట్రీ పాఠ్యాంశాలున్నాయి. రెండు విభాగాల నుంచి 39 చొప్పున ఛాయిస్‌తో 78 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. కాంతి, ఆమ్లాలు–క్షారాలు పాఠాల నుంచి రెండు పటాలు వస్తాయి. నాలుగు మార్కులు స్కోర్ చేయవచ్చు. లోహాలు – అలోహాలు పాఠం నుంచి 8 మార్కులకు ఒక ప్రయోగం వస్తుంది. విద్యుత్ పాఠం నుంచి 8 మార్కులకు ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది.
–అడబాల వీఎల్ నరసింహారావు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్, జెడ్పీహెచ్‌ఎస్, చింతల్లంక, అయినవిల్లి మండలం
ఇంగ్లీష్.. ఈజీగా స్కోర్ చేయొచ్చు
ఇంగ్లిషు ప్రశ్నపత్రం మూడు విభాగాలుగా ఉంటుంది. గ్రామర్, ఒకాబ్యులరీపై అధికంగా సాధన చేయాలి. సెక్షన్–ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్, సెక్షన్–బీలో గ్రామర్ అండ్ ఒకాబ్యులరీ, సెక్షన్–సీలో క్రియేటివ్ రైటింగ్ ఉంటాయి. సెక్షన్–ఏలో 30 మార్కులకు 24 మార్కులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, ఆరు సాధారణ ప్రశ్నలుంటాయి. పేరాను బాగా చదివి అర్థం చేసుకుంటే కచ్చితంగా 24 మార్కులు స్కోర్ చేయవచ్చు. పాఠ్య పుస్తకాల చివర ఇచ్చే గ్రామర్‌ను బాగా చదివితే 25 మార్కులు ఈజీగా సాధించవచ్చు. క్రియేటివ్ రైటింగ్‌లో లెటర్ రైటింగ్, కాన్వర్సేషన్, స్పీచ్, డైరీ ఎంట్రీ, డబ్ల్యూహెచ్ వర్డ్ ప్రశ్నలు, పేరాగ్రాఫ్ రైటింగ్ ప్రశ్నలకు బాగా సాధన చేయాలి. కొత్త సిలబస్‌తో పాటు, నూతన విధానంలో ప్రశ్నపత్రం ఇస్తారు. నౌన్ మోడిఫయర్స్ కొత్తగా ప్రవేశపెట్టారు.
– ఆర్.వెంకటేశ్వరరావు, జెడ్పీ హెచ్‌ఎస్, భీమనపల్లి, ఉప్పలగుప్తం మండలం
గణితానికి ఓ లెక్కుంది
గణిత భావనలు బాగా అవగాహన చేసుకుని సూత్రాలపై పట్టు సాధిస్తే గణితమంత సులువైన సబ్జెక్టు మరొకటి ఉండదు. 1, 3, 7, 13, 14 అధ్యాయాలను బాగా అధ్యయనం చేస్తే ప్రతి విద్యార్థి కచ్చితంగా 60 మార్కులు పొందే వీలుంది. ఈ ఐదు చాప్టర్లు గణితంలో పంచరత్నాలుగా భావించాలి. ఈ చాప్టర్ల నుంచే సులభమైన 8 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు మిగిలిన అధ్యాయాల్లో 1, 2, 4 మార్కుల ప్రశ్నలపై పట్టు సాధిస్తే 100 మార్కులు సులభంగా స్కోర్ చేయవచ్చు.
–టీఎస్‌వీఎస్ సూర్యనారాయణమూర్తి (గణితావధాని), జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, అమలాపురం
తెలుగు: 4 ప్రశ్నల నుంచి 32 మార్కులు
తెలుగులో అవగాహన– ప్రతి స్పందనపై నాలుగు ప్రశ్నల ద్వారా 32 మార్కులు సాధించవచ్చు. వ్యక్తీకరణ – సృజనాత్మకత నుంచి నాలుగు మార్కుల ప్రశ్నలు మూడు, ఎనిమిది మార్కుల ప్రశ్నలు మూడు వస్తాయి. వీటి ద్వారా 36 మార్కులు పొందవచ్చు. ప్రధానంగా పద్యభాగంలో కవి పరిచయాలు, గద్యభాగంలో ప్రక్రియలు, రామాయణంలో పాత్రలు చదవడం ద్వారా 12 మార్కులు సాధించవచ్చు. 8వ ప్రశ్నగా కేవలం పద్యభాగ సారాంశాలు, 9వ ప్రశ్నగా రామాయణం, 10వ ప్రశ్నగా సృజనాత్మకత (లేఖ, కరపత్రం) ద్వారా 24 మార్కులు పొందవచ్చు. 32 మార్కులను కేవలం పాఠ్య పుస్తకం వెనుక ఉన్న అభ్యాసాల ద్వారా సాధించవచ్చు. అవగాహన ప్రతిస్పందన నుంచి పరిచిత పద్యం ఆటవెలది, తేటగీతి, కంద పద్యాలు మాత్రమే ఇస్తారు.
– జి.ప్రభావతి, పాఠ్య పుస్తక రచయిత్రి, జెడ్పీహెచ్‌ఎస్, సఖినేటిపల్లిలంక
బయాలజీలో ఈజీగా ఆ డయాగ్రామ్స్ తప్పనిసరి
మారిన సిలబస్‌ను అనుసరించి బయాలజీ ప్రశ్న పత్రం 50 మార్కులకు 17 ప్రశ్నలతో ఉంటుంది. జవాబులు రాసే ముందు ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. సెక్షన్–4లో ప్రయోగాలపై 8 మార్కులకు ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. అందువల్ల జీవక్రియలు పాఠంపై అవగాహన అవసరం. అనువంశికత పాఠం నుంచి 8 మార్కుల ప్రశ్న వస్తుంది. ఈ రెండు పాఠ్యాంశాలు బాగా చదివితే 16 మార్కులు తప్పనిసరిగా పొందవచ్చు. సెక్షన్–3లో ఒక డయాగ్రామ్ వస్తుంది. ప్రత్యుత్పత్తి పాఠం నుంచి ఒక డయాగ్రామ్ తప్పనిసరిగా వస్తుంది.
–మేకా రామలక్ష్మి, డీసీఈబీ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్, ఎస్‌జీ మున్సిపల్ ఉన్నత పాఠశాల, మండపేట
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ap tenth exams
- AP SSC Public Exams Schedule
- public exams schedule
- ap tenth public exams schedule
- Breaking News AP 10th Public Exams Schedule 2025 Released
- tenth public exams 2025 dates
- ap tenth board 2025
- ap open tenth exam schedule 2025
- Tenth Class Exams
- Exam preparation
- study tips
- AP 10th Class Important Topics
- Subject-wise Strategies
- Question Paper Pattern
- SSC Exam Strategy
- 10th Class Study Tips in Telugu
- SSC Board Exam Preparation 2025
- AP & TS 10th Class Exams 2025
- పదో తరగతి ప్రశ్నపత్రం 2025
- Best Study Plan for 10th Class
- SSC Exam Important Topics
- 10th Class Time Table 2025
- Top Tips to Score High in SSC Exams