AP 10th Class Exam Postponed: ఏపీ పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా.. కారణమిదే!
Sakshi Education
సాక్షి, అమరావతి: పదో తరగతి విద్యార్థులకు కీలక అప్‌డేట్.. పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ప్రభుత్వం ఈనెల 31న రంజాన్ సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు మార్పు చేసినట్టు ప్రకటించారు.
AP 10th Class Exam Postponed
పరీక్ష తేదీని విద్యార్థులు, హెచ్ఎంలు, ఇన్విజిలేటర్లు, పోలీస్ శాఖ, ట్రెజరీ సిబ్బంది, పోస్టల్ శాఖతో పాటు పదో తరగతి పరీక్షల నిర్వహణలో పాలుపంచుకుంటున్న అన్ని విభాగాలకు తెలియజేయాలని ఆర్జేడీ, డీఈవోలను ఆదేశించారు. మెటీరియల్, ప్రశ్నపత్రాలు తీసుకునేందుకు ఈనెల 31న నిల్వ కేంద్రాల వైపు వెళ్లొద్దని సూచించారు.