Skip to main content

10th Class Maths Question Paper Leak: వాట్సప్‌లో టెన్త్ మ్యాథ్స్‌ పేపర్ లీక్‌లో కీలక పరిణామం.. వాటర్‌ బాయ్‌ ద్వారా..

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : వైఎస్సార్‌ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో  లీకైన గణితం ప్రశ్నాపత్రం లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రం లీకేజీలో ప్రమోయమున్న తొమ్మదిమందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
10th Class Maths Question Paper Leak
10th Class Maths Question Paper Leak

ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే  కొన్ని సబ్జెక్టులు పూర్తి కాగా, ఇటీవల నిర్వహించిన గణితం పరీక్షలో పేపర్‌ లీకేజీ జరిగింది. వైఎస్సార్‌ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత ఉన్నత పాఠశాల బి కేంద్రంలో గణితం ప్రశ్నా పత్రం వాట్సప్‌లో షేర్‌ చేసినట్లు తెలిసింది.

పేపర్‌ లీకేజీపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, పోలీసుల విచారణలో సాయి అనే వాటర్‌ బాయ్‌ ద్వారా ప్రశ్నాపత్రం ఫోటో తీయించి లీక్‌ చేసినట్లు నిర్ధారించారు.

10th Class Question Paper Leakage News: సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన పదో తరగతి గణిత ప్రశ్నలు

Tenth Class Question Paper Leakage News:పరీక్షల నిర్వహణలో' ప్రభుత్వం ఫెయిల్‌ ....టెన్త్‌ లెక్కల పేపర్‌ లీక్‌

ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి వాటర్‌ బాయ్‌ వాట్సప్ ద్వారా కమలాపురం వివేకానంద ఇంగ్లీష్‌ మీడియం యాజమాన్యానికి పంపినట్లు తేలింది. నిందితుల్లో వివేకానంద స్కూల్‌ కరస్పాండెంట్‌ రామసుబ్బారెడ్డితో సహా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోయం ఉన్నట్లు తేలింది. మాస్‌ కాపీయింగ్‌ కోసమే పేపర్‌ లీక్‌ చేశారంటూ పోలీసుల  సైతం ప్రకటించారు. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 27 Mar 2025 01:19PM

Photo Stories