Open Tenth Board Exams 2025 : ఓపెన్ టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షలు వచ్చే నెల అంటే, మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమై అదే నెల 31వ తేదీన ముగియనున్నాయి. అయితే, తాజాగా ఏపీ ఓపెన్ టెన్త్ విద్యార్థుల బోర్డు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు.
రోజు తప్పి రోజు..
ఏపీ టెన్త్ ఓపెన్ స్కూల్ పరీక్షల తేదీలను ఖరారు చేసి, సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసింది. విద్యార్థులకు ఓపెన్ పరీక్షలను కూడా మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, వీరికి రోజు తప్పి రోజుల్లో పరీక్షలను నిర్వహించి, మార్చి 28వ తేదీ వరకు ప్రతీ పరీక్షను ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30వరకు ప్రతీ పరీక్షను జరుపుతారు.
ఓపెన్ టెన్త్ షెడ్యూల్..
మార్చి 17- హిందీ(Hindi)
మార్చి 19- ఇంగ్లీష్(English)
మార్చి 21- తెలుగు/ఉర్దూ/కన్నడ/ఒరియా/తమిళం
(Telugu, Urdu, Kannada, Oriya, Tamil)
మార్చి 24- మ్యాథ్స్ (Maths)
మార్చి 26- శాస్త్ర సాంకేతిక విజ్ఞానం (science and technology)
మార్చి 28- సోషల్ (Social), ఆర్థిక శాస్త్ర(Economics).
విద్యార్థుల హాల్‌టికెట్లను విడుదల చేసిన వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందే పరిశీలించుకోవాలి. వెళ్లే దారి, వాహనం వంటివి ఏర్పాటు చేసుకోవాలి. ప్రతీ విద్యార్థి తమకు ప్రకటించిన సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆలస్యమైనా, గేట్ లోపలికి అనుమతి ఉండదు అనే విషయాని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ప్రతీ హెచ్చరికను, నియమాలను విద్యార్థులు పాటించాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ap tenth exams
- ap open tenth students
- public exams schedule
- tenth exams hall tickets 2025
- ap open tenth public exams schedule 2025
- tenth public exams 2025 dates
- AP education department
- School Education Department
- ap tenth board 2025
- tenth exam dates announcement 2025
- exam centers
- exam centers for ap open tenth public exams 2025
- students education
- march 17th to 28th
- ap open tenth exam schedule 2025
- ap tenth public exams dates
- Education News
- Sakshi Education News