Skip to main content

AP 10th Class Exam Fees: ఏపీ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఇదే

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లింపు పక్రియ ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు సోమవారం ఈ వివరాలు తెలిపారు. ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 26వ తేదీలోగా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు.
AP 10th Class Exam Fees
AP 10th Class Exam Fees

రూ.50 అపరాధ రుసుంతో 27 నుంచి డిసెంబర్‌ 2 వరకూ, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్‌ 3 నుంచి 9 వరకూ, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబర్‌ 10 నుంచి 16వ తేదీ వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. నామినల్‌ రోల్స్‌, డాక్యుమెంట్లను ప్రధానో పాధ్యాయులు ఈ నెల 26వ తేదీలోగా అందజేయాలి.

AP School Timings Changed: విద్యార్థులకు అలర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు

పరీక్ష ఫీజును డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి స్కూల్‌ లాగిన్‌ ద్వారా చెల్లించాలి. సీఎఫ్‌ఎంఎస్‌, బ్యాంకు చెల్లింపులను అనుమతించరు. పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరు.


పరీక్ష ఫీజు వివరాలివీ..

  • ఫ రెగ్యులర్‌ విద్యార్ధులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125.
  • ఫ మూడు అంతకంటే తక్కువ సబ్జెక్టులు ఉన్న వారు రూ.110.
  • ఫ 3 కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉన్న వారు రూ.125.
  • ఫ వృత్తి విద్యా కోర్సు విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.125తో పాటు అదనంగా రూ.50 చెల్లించాలి.
  • ఫ తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులు కాండొనేషన్‌ ఫీజు రూ.300 చెలించాలి.
  • ఫ అవసరమైతే మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌కు రూ.80 చెల్లించాలి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 19 Nov 2024 05:14PM

Photo Stories