Skip to main content

AP Tenth Class Exams : యూట్యూబ్‌లో పేపర్‌ లీక్స్‌.. పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ప్రశ్నపత్రాలు

సాక్షి, అమరావతి: పదో తరగతి సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌–1 లెక్కల ప్రశ్నాపత్రం యూట్యూబ్‌లో ప్రత్యక్షమైన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అన్ని తరగతుల ప్రశ్నాపత్రాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరిచి, పరీక్ష జరిగే రోజు అక్కడి నుంచే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష పత్రాలకు ఎంఈవో–1, 2 ఇద్దరు కస్టోడియన్లుగా ఉండాలని ఆదేశించారు. పరీక్ష నిర్వహించే రోజు గంటముందు మాత్రమే ప్రశ్నాపత్రాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందించాలని సూచించారు. 
AP Tenth Class Exams paper leaks
AP Tenth Class Exams paper leaks

సోమవారం జరగాల్సిన పదో తరగతి మేథ్స్‌ ప్రశ్నాపత్రం మూడు రోజుల ముందే సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఈ విషయం గుర్తించకుండా అదే ప్రశ్నాపత్రం విద్యార్థులకు అందించారు. అనంతరం తేరుకున్న అధికారులు సోమవారం నిర్వహించాల్సిన అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అర్ధ వార్షిక పరీక్షల నిర్వహణే ఇంత అధ్వానంగా ఉన్న నేపథ్యంలో మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను ఇంకెంత గొప్పగా నిర్వహిస్తారోనని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Breaking News School Holidays: పలు జిల్లాల్లో స్కూల్లు, కాలేజీలకు సెలవులు!.. ఎందుకంటే??

గత ఐదేళ్లలో పక్కాగా..

గత ఐదేళ్లలో ఒక్క దుస్సంఘటన కూడా లేకుండా అన్ని పరీక్షలను ప్రభుత్వం పక్కాగా నిర్వహించింది. పరీక్షకు గంట ముందు ఆన్‌లైన్‌లో పేపర్‌ పంపించి, అక్కడే ప్రింట్‌ తీసుకుని విద్యార్థులకు అందించేవారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న విద్యాశాఖ.. ఇప్పుడెందుకు తేలిగ్గా తీసుకుందని ప్రశ్నిస్తున్నారు.

AP 10th Class 2023: టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌... వారికి ఎక్కువ  మార్కులొచ్చే ఛాన్స్‌! | Sakshi Education

ఇలా ఉండగా, ఎస్‌ఏ–1 పరీక్షలు ఈనెల 19వ తేదీతో ముగుస్తాయి. అనంతరం లెక్కల పరీక్షను 20వ తేదీన నిర్వహించనున్నారు. కాగా, ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరోపక్క విద్యాశాఖ డైరెక్టర్‌ దర్యాప్తునకు ఆదేశించారు.

Exams Question Paper Leak Cases 2024 : ఈ ఏడాది పేపర్ లీక్ అయిన ప‌రీక్ష‌లు ఇవే.. ఎక్కువ‌గా ఈ ప‌రీక్ష‌లే...!

ఉపాధ్యాయులకు విషమ పరీక్ష

ప్రశ్నాపత్రాల భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు ఉపాధ్యాయులకు సంకటంగా మారాయి. పరీక్షకు గంట ముందు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరిచిన ప్రశ్నాపత్రాలను ఎంఈవో సమక్షంలో ఉపాధ్యాయులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

All Set for AP SSC 10th Class Exams 2024 Answer Sheets Evaluation: Check  Results Date | Sakshi Education

పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ సమయం సరిపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రశ్నాపత్రాలు చేరడం కష్టసాధ్యమవుతుంది. చాలా గ్రామాల్లో పాఠశాలలు మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ నుంచి దాదాపు 20 నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్నాయి. పోలీస్‌ స్టేషన్‌లో అన్ని ప్రక్రియలు పూర్తిచేసి సమయానికి చేరడం ఎంతో ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 18 Dec 2024 01:15PM

Photo Stories