AP 10th Class Exam Fees: ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
Sakshi Education
రాయచోటి (జగదాంబసెంటర్) : అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు గడువును ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ వరకు పెంచిందని అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు.
AP 10th Class Exam Fees
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని, అదే విధంగా రెండు పర్యాయాలు పరీక్షా రుసుము చెల్లించుటకు తేదీలను కూడా ప్రభుత్వం మార్చిందన్నారు.
అపరాధ రుసుము లేకుండా ఈనెల 26వ తేదీలోగా పాఠశాల లాగిన్ ద్వారా www.bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో ఎన్‌ఆర్, అదనపు పత్రాలు సబ్‌మిట్ చేయాలని డీఈఓ తెలియజేశారు.