AP Tenth Class Examination : మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు.. ఈసారి నూతన విధానంలో..

మార్చి 17 నుంచి పరీక్షలు
పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సోషల్ పరీక్ష రోజున రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 31 లేదా ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహించే అవకాశముంటుంది. పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశారు. ఆరు సబ్జెక్టులకు ఏడు పేపర్లు మాత్రమే ఉంటాయి. సైన్స్ సబ్జెక్టు తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులకు 100 మార్కులకు ఒకే రోజు పరీక్ష ఉంటుంది. ఫిజిక్స్, బయాలజీలకు ఒక్కో సబ్జెక్టుకు 50 మార్కుల చొప్పున రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ ఏడాది పరీక్షలు ఇలా..
2022–23 విద్యా సంవత్సరంలో పది పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లకు కుదించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులకు నిర్వహించారు. సైన్స్ సబ్జెక్టులో మాత్రం ఫిజికల్ సైన్స్, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించి ఒకే ప్రశ్న పత్రం ఇచ్చారు. అయితే జవాబులు మాత్రం వేర్వేరు సమాధాన పత్రాల బుక్‌లెట్స్‌లో రాయాల్సి వచ్చేది. గత విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో పీఎస్, బయాలజీ జవాబు పత్రాలను సంబంధిత ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయడానికి వీలుగా ఇలా వేర్వేరు జవాబు పత్రాల్లో రాయించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొడుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. 2024–25 విద్యాసంవత్సరంలో నిర్వహించే పది పబ్లిక్ పరీక్షల్లో కూడా ఆరు సబ్జెక్టులకు ఏడు పరీక్షలుగా నిర్వహించనున్నారు.
ఒత్తిడి తగ్గుతుంది
పది పబ్లిక్ పరీక్షల్లో ఆరు సబ్జెక్టులకు ఏడు పేపర్లు ఉండడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం నిర్వహించే 100 మార్కుల పేపరు మోడల్‌కు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం.
– పి.గురుస్వామిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్, తిరుపతి
అంచనా వేసేందుకు వీలవుతుంది
ఒక్కో సబ్జెక్టును వంద మార్కులకు ఒకటే పేపరుతో పరీక్ష నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో భయాందోళనలు తగ్గుతాయి. విద్యార్థుల అకడమిక్ స్థాయిని కచ్చితంగా అంచనా వేయడానికి సాధ్యమవుతుంది.
– కేవీఎన్.కుమార్, జిల్లా విద్యాశాఖాదికారి(డీఈఓ), తిరుపతి
Tags
- AP SSC 10th Class Public Exams 2025 Timetable
- AP SSC 10th Class Public Exams 2025 Timetable News in Telugu
- 10th Class Exams
- 10th class pre final exam 2025
- 10th class pre final exam 2025 time table
- AP SSC exam 2025
- AP SSC exam 2025 Released
- AP SSC exam 2025 Released
- ap 10th class exam schedule 2025 changes news in telugu
- Tenth Class Exams
- Tenth Class Exam
- AP Tenth Class exams News
- AP Tenth Class Exams
- AP Tenth Class Exam News