Skip to main content

AP PTF: టీచర్ల సెలవులపై ఆంక్షలు సరికాదు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సెలవుల వినియో గంపై ఆంక్షలు సరికాదని ఆంధ్రప్రదేశ్ పూలే టీచర్స్ ఫెడరేషన్ ఓ ప్రకటనలో ఖండించిం ది. సెలవులపై ఆంక్షలు విధించడం ఇబ్బందికర పరిణామమని, తమను ఒత్తిడికి గురి చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
Andhra Pradesh Poole Teachers Federation appeals to government to lift leave restrictions  Restrictions on teachers leave are inappropriate   Andhra Pradesh Poole Teachers Federation condemns leave restrictions for government school teachers

పనివేళల పెంపు రద్దు చేయండి

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పెంచుతూ పైలట్ ప్రాజెక్టు పేరుతో అమలు చేయాలన్న ఉత్తర్వులను నిలిపివే యాలని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని, తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

చదవండి: School Timings : పాఠ‌శాల‌ల్లో అన‌ధికారికంగా మార్చిన స‌మ‌యం!

పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను పునరుద్ధరించాలి

పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను పునరుద్ధరించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లుగా జిల్లా పరిషత్ సీనియర్ ప్రధానోపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేసింది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 23 Nov 2024 11:40AM

Photo Stories