Skip to main content

Infosys Layoffs 2025 : కన్నీటితో ఇళ్లకు వెళ్లిన ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్... ఒకేసారి దారుణంగా ఇంత మందిని...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : చాలా మంది యువత ఆశలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. గ్యాడ్యుయేషన్ పూరైన వెంటనే సగటు వ్యక్తి ఆశ సాఫ్ట్‌వేర్ జాబ్ సంపాదించడం. లక్షల్లో ప్యాకేజీలు అందుకోవడం, ఫ్లాట్లు, కార్లు ఇలా ఎన్నో ఆశలు.
infosys layoffs 700 freshers

కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. యువత సాఫ్ట్‌వేర్ ఆశలు ఆవిరి అవుతున్నాయి. గత రెండేళ్లుగా టెక్ కంపెనీలు తమ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏకంగా 700 మంది ఫ్రెషర్లను ఒకేసారి తొలగించారు.

కేవలం 6 నెలల్లోనే నిరుద్యోగులుగా..
గ్రాడ్యుయేషన్ పూరైన‌ తర్వాత 2024 సెప్టెంబర్ నెలలో ఇన్ఫోసిస్‌లో కెరీర్ ప్రారంభించిన వారు.. కేవలం 6 నెలల్లోనే నిరుద్యోగులుగా మారారు. ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ నుంచి దాదాపుగా 400 మందికి లేఆఫ్స్ ప్రకటించింది. తొలగించిన వెంటనే క్యాంపస్ నుంచి వెళ్లిపోవాలని కంపెనీ కోరింది. ప్లీజ్ ఈ ఒక్క రాత్రి ఉండనివ్వండి అని ఎంతో దీనంగా వేడుకున్నా యాజమాన్యం కనికరించలేదని బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ జాబ్ పోయిందని తమ తల్లిదండ్రులకు ఎలా తెలియజేయాలని కొందరు కన్నీరుమున్నీరయ్యారు.

ఒకే సారికి వందలాది మందికి...
మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక యువ ట్రైనీ ఫిబ్రవరి 7న ఇన్ఫోసిస్ అధికారులను దయచేసి నన్ను రాత్రి ఉండనివ్వండి. నేను రేపు బయలుదేరుతాను. ఇప్పుడే నేను ఎక్కడికి వెళ్తాను? అని వేడుకుంది. ఒకే సారికి వందలాది మందికి ఉద్వాసన పలికిన విషయం సంచలనంగా మారకుండా ఉండేందుకు బస్సులను అడ్డుపెట్టి కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఉదయం 9.30 గంటలకు ట్రైనీలను 50 మంది బ్యాచ్‌లుగా పిలిచి, వారి ల్యాప్‌టాప్స్ తీసుకురావానలి కోరారు. గది బయట భద్రతా సిబ్బంది, లోపల బౌన్సర్లను కాపలాగా పెట్టారు.

Published date : 13 Feb 2025 10:21AM

Photo Stories