Skip to main content

DSC Merit Lists: జిల్లాలకు డీఎస్సీ మెరిట్‌ జాబితాలు.. ఒక్కో పోస్టుకు ఇంత‌ మంది చొప్పున ఎంపిక

సాక్షి, హైదరాబాద్‌: డీఎస్సీ ఫలితాల విడుదల నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
DSC Merit Lists for Districts news in telugu  Authorities preparing for teacher recruitment process  Three candidates selected per teacher post  Teacher recruitment speed-up after DSC results

డీఎస్సీ మెరిట్‌ జాబితాలను ఇప్పటికే రూపొందించారు. అందులో మెరిట్‌ ప్రకారం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేశారు.

ఈ జాబితాలను జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ)లకు పంపుతున్నట్టు సీఎం ప్రకటించారు కూడా. ఆ జాబితాల ఆధారంగా జిల్లాల్లో అక్టోబర్‌ 5వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.

చదవండి: TG DSC 2024 Results District-Wise Vacancy Posts: డీఎస్సీ ఫలితాల్లో ఈసారి రికార్డ్‌.. జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్‌ చెక్‌ చేసుకోండిలా

7వ తేదీ నాటికి అన్నిరకాల పరిశీలన, విచారణలు పూర్తి చేసి, నియామకాలను ఖరారు చేస్తారు. 9వ తేదీన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు.

డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకారం.. భర్తీ చేయనున్న టీచర్‌ పోస్టులు హైదరాబాద్, పరిసర జిల్లాల్లో ఎక్కువగా, ఇతర జిల్లాల్లో తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, ఇతర జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

శిక్షణ తర్వాతే పోస్టింగ్‌.. 

రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహించారు. దీనికి 2,79,838 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,46,584 మంది (88.11 శాతం) హాజరయ్యారు. 33 జిల్లాల్లోని 54 కేంద్రా ల్లో ఆన్‌లైన్‌ విధానంలో జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ పరీక్ష నిర్వహించారు.

తాజాగా ఫలితాలు విడుదల చేశారు. మెరిట్‌ అభ్యర్థుల్లో 33,186 మందిని (ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున) ఎంపిక చే శారు. వీరిలో 11,062 మంది టీచర్లుగా ఎంపికవుతారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, స్కూల్‌ అసిస్టెంట్స్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులు 796 ఉన్నాయి.

చదవండి: TG DSC-2024 Results Click Here for Results

నియామక ప్రక్రియ పూర్తవగానే.. కొత్త టీచర్లందరికీ తాజా పరిణామా లు, విద్యా రంగంలో వస్తున్న మార్పులపై నిపుణులతో శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తోందని.. శిక్షణ తర్వాతే స్కూళ్లకు టీచర్లుగా పంపే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 

అత్యధిక పోస్టులున్న జిల్లాలివే:

  • హైదరాబాద్‌- 537 SGT పోస్టులు 
  • పెద్దపల్లి- 21 పోస్టులు 
  • ఖమ్మం - 176 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
  • మేడ్చల్‌ మల్కాజిగిరి- 26 SA పోస్టులు 
  • ఆదిలాబాద్- 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 209 SGT పోస్టులు
  • నల్గొండ-  383 SGT పోస్టులు
  • హన్మకొండ- 158 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 81 SGT పోస్టులు 
  • జగిత్యాల - 99 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 161 SGT పోస్టులు
  • సూర్యాపేటా-  86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు,224 SGT పోస్టులు 
  • యాదాద్రి-  84 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 137 SGT పోస్టులు 
Published date : 01 Oct 2024 12:34PM

Photo Stories