Skip to main content

Again TG DSC and TET Notification 2024 : తెలంగాణ‌లో మ‌రో టెట్‌, డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌... ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వ నిరుద్యోగుల‌కు మ‌రో గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న‌ది. విద్యాశాఖలోని టీచర్ల ఖాళీలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే 11,062 పోస్టుల భర్తీకి సంబంధించి దాదాపు ప్రక్రియ పూర్తి చేసి.. వీరికి ఉద్యోగాలు ఇచ్చింది. అలాగే వీరికి త్వరలోనే పని చేసే ప్రాంతాలను కూడా ఖరారు చేయనున్నారు.
Again TG DSC and TET Notification 2024  Government preparing teacher vacancy notifications in Telangana  Teacher recruitment process in Telangana education department  Teacher Eligibility Test (TET) notification details

దాదాపు 6000 టీచ‌ర్ పోస్టుల‌కు పైగా..
ఇదిలా ఉంటే.. మరికొన్ని ఖాళీలను గుర్తించి వాటిని కూడా భర్తీ చేయాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. కొద్ది నెలల కిందట అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో భర్తీ చేసే ఉద్యోగాలతో పాటు నెలలను కూడా వెల్లడించింది. తెలంగాణ విద్యాశాఖలోని మరికొన్ని టీచర్ ఖాళీల భర్తీకి ప్ర‌భుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ లో ఏమైనా ఖాళీలు ఉంటే... వాటిని కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వ‌నున్నారు. అలాగే టెట్ రాత పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తారు.

మ‌రో టీఎస్ నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..?
తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 2025లో ఇవ్వ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు స్వీకరణ తర్వాత ఏప్రిల్ 2025లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ లో 5000 నుంచి 6000 మధ్య టీచింగ్ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.ఈ నోటిఫికేషన్ తర్వాత ఏప్రిల్ నెలలోనే మరోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

☛➤ Two Sisters Success Storeis : మేము అక్కాచెల్లెళ్లు.. ఒకే సారి ఇద్ద‌రం ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టాం... ఎందుకంటే..?

ఏపీలో మ‌రో డీఎస్సీ నోటిఫికేషన్‌పై క్లారిటీ.. కొత్త‌ సిలబస్ ఇదే...!
కూట‌మి అధికారంలోకి వస్తే.. డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పై  తొలి సంతకం చేస్తానని ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఫైల్ పై తొలి సంతకం చేశారు. గ‌త ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 6000 పోస్టులతో పాటు.. దానికి మరో 10 వేల పోస్టులను కలిపి మొత్తం 16 వేలకు పైగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే నోటిఫికేషన్ ఇంతవరకు జారీ కాలేదు. ఈ ప్ర‌క్రియ కూడా ముందుకు సాగేలా క‌నిపించ‌డం లేదు. డీఎస్సీ అభ్య‌ర్థుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్న నేప‌థ్యంలో... ఇప్పుడు హాడావిడిగా డీఎస్సీ కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం. అదే విధంగా సిలబస్ పై కూడా స్పష్టత ఇచ్చింది. 

☛➤ KGBV Jobs Notification 2024 : గుడ్‌న్యూస్‌.. KGBVల‌లో 1333 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

నోటిఫికేష‌న్ తేదీ ఇదే..?
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2024 ను నవంబరు 3వ తేదీన‌ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించింది ప్రభుత్వం. అంతకుముందు టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. గత కొద్దిరోజులుగా టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఫలితాలను నవంబర్ 2వ తేదీన‌ ప్రకటించేందుకు రంగం సిద్ధం అవుతోంది. టెట్ ఫలితాలు విడుదల తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

☛➤ DSC Ranker Success Story : ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 6 ప్ర‌భుత్వం ఉద్యోగాలు కొట్టానిలా... కానీ..

డీఎస్సీ సిలబస్ ఇదే..!
డిసెంబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాల‌నే ఆలోచ‌న‌లో ప్రభుత్వం ఉంది.  డీఎస్సీ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యధావిధిగా పాత సిలబస్‌ను కొనసాగించడానికి నిర్ణయించింది. 

➤☛ TS Revenue Department Jobs 2024 : రెవెన్యూ శాఖలో కొత్తగా 5000 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. పోస్టుల వివ‌రాలు ఇవే...

గ‌త ప్ర‌భుత్వ పుణ్య‌మే..
వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. కానీ ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. దానికి కేవ‌లం 10,200 పోస్టులు జతచేస్తూ ప్ర‌స్తుత కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ.. నోటిఫికేష‌న్‌ను జారీ చేయనుంది. ఈ ప్ర‌భుత్వం కేవ‌లం 10200 పోస్టుల‌కు మాత్ర‌మే నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఈ పోస్టుల భ‌ర్తీ వివిధ కార‌ణాలు చూపుతూ.. ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది. ఈ డీఎస్సీ ప్ర‌క్రియ కూడా పూర్తి చేసి అభ్య‌ర్థుల‌కు ఉద్యోగాలు వ‌చ్చే వ‌ర‌కు న‌మ్మ‌కం లేదు చాలా మంది అభ్య‌ర్థుల‌కు.

➤☛ Brother and Sister Success Story : ఒకేసారి మేము ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాం ఇలా.. మా చిన్నప్పుడే నాన్న‌ చనిపోయినా.. మా అమ్మ...

Published date : 11 Oct 2024 10:18AM

Photo Stories