Skip to main content

D Sridhar Babu: వైద్యరంగంలో కృత్రిమ మేధ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణను త్వరలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌కు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా మారుస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు.
Artificial Intelligence in Medicine  Hyderabad IT Minister Duddilla Sridharbabu announces plans for quantum computing center

ఇప్పటికే సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ పరిశోధన, అభివృద్ధిలో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రానికి సిలికాన్‌ వ్యాలీ సంస్థలను తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. ‘వైద్య రంగంలో కృత్రిమ మేధ’అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు.

ఏఐజీ చైర్మన్‌ డా.నాగేశ్వరరెడ్డి, సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన డా. డియన్‌ హో, నారాయణ వైద్యాలయ వైస్‌ చైర్మన్‌ వీరేన్‌ శెట్టి, ప్రపంచ ఆరోగ్యసంస్థ డిజిటల్‌ హెల్త్‌ విభాగం సభ్యుడు డా. రాజేంద్ర గుప్తాలు పాల్గొన్న ఈ సదస్సులో శ్రీధర్‌బాబు ప్రసంగించారు.

చదవండి: NACC: న్యాక్‌ బృందం సందర్శన.. నాణ్యతా ప్రమాణాల ఆధారంగా గ్రేడ్‌

నాలుగో పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధను విస్తతంగా వినియోగించే దిశగా ముందుకు నడుస్తుందన్నారు. ఆస్పత్రుల్లో రోగుల సమాచారాన్ని పొందుపర్చడంలో పలు సంస్థలు ఇప్పటికే ఏఐ సహాయాన్ని తీసుకుంటున్నాయని, ఇది రోగులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

వైద్య సంరక్షణలో కృత్రిమ మేధ వినియోగంపై ఒక రోడ్‌ మ్యాప్‌ను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర హెల్త్‌ సైన్సెస్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ సీఈవో వి.మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Published date : 20 Nov 2024 09:35AM

Photo Stories