TET 2024 : రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం.. ఇవి తప్పనిసరిగా పాటించాలి..!!
సాక్షి ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల ఉద్యోగం కోసం అభ్యర్థులు రాసే పరీక్ష టెట్.. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. జనవరి 2వ తేదీ అంటే, రేపటి నుంచి జనవరి 20వ తేదీ వరకు సాగే ఈ పరీక్షలకు 2,75,753 మంది హాజరు కానున్నారు. వీరిలో, వీరిలో పేపర్-1కు 94,327 మంది, పేపర్-2కు 1,81,426 మంది అటెండ్ అవుతారని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి వెల్లడించారు.
వీరంతా, రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన 92 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకూ ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ సెకండ్ సెషన్ ఎగ్జామ్‌కు హాజరు కావాలని ఆదేశించారు.
పరీక్ష వివరాలు ఇలా..
2025, జనవరి 2, 5, 8, 9, 10, 11, 12, 18, 19, 20 తేదీల్లో తెలంగాణ టెట్ పరీక్షలు నిర్వహిస్తుండగా, జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష, జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. వీటిని ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో నర్వహిస్తారు. హాల్‌టికెట్ ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండగా, అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని పరిశీలించుకోవాలి. కేంద్రం చిరునామా, వెళ్లేందుకు దారులు వంటి చిన్న చిన్న విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి. తద్వారా పరీక్ష రోజు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవచ్చు.
TET 2024 Candidates : ప్రారంభం కానున్న టెట్ పరీక్షలు.. ఇప్పటికీ తప్పని తిప్పలు!!
ముఖ్యమైన రూల్స్ ఇవే..
1. అభ్యర్థులు పరీక్ష సమయాని అరగంట ముందే కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. హాల్ టికెట్ తమ వెంట తెచ్చుకోవడం తప్పనిసరి.
2. ప్రతిరోజు రెండు సెషన్‌లలో పరీక్షలను నిర్వహించనున్నారు. కాగా, అభ్యర్థులు తమ సమయాన్ని గుర్తుపెట్టుకొని హాజరుకావాలి.
3. తొలి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరగనుంది. అభ్యర్థులను ఉదయం సెషన్‌కు ఉదయం 7.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఉదయం సెషన్‌కు ఉదయం 8.30 గంటల తర్వాత గేట్లను మూసివేస్తారు.
TET 2024 Hall Ticket Download : టెట్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విధానం ఇలా.. ఏదైనా సమస్య ఉంటే ఇలా చేయండి..
4. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులను మధ్యాహ్నం సెషన్‌కు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత గేట్లను మూసివేస్తారు.
5. పరీక్ష కేంద్రానికి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. ఎటువంటి ఎలక్ట్రాకిక్ గ్యాడ్జెట్స్‌కు అనుమతి లేదు. పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు.
6. అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in/ లో వివరణాత్మక పరీక్ష షెడ్యూల్ అందుబాటులో ఉంది.
7. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 7032901383, 9000756178, 7075088812, 7075028881, 7075028882 లేదా 7075028885 అనే నంబర్‌లకు కాల్ చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- TET 2024
- tet exams latest updates
- teachers exam
- school teachers eligibility test
- online exam
- Rules and regulations
- tet exams rules
- ts tet 2024 hall ticket download
- ts tet updates in telugu
- tet latest news in telugu
- january 2nd to 20th
- government teachers exam
- School Education Department
- Director of School Education EV Narasimha Reddy
- Education Department
- Telangana Government
- tet paper 1 and 2 exam updates
- hall tickets for tet exams 2024
- 92 exam centers for tet exams 2024
- ts tet 2024 exam hall ticket download
- computer based exam
- online based tet exam 2024
- Education News
- Sakshi Education News