Skip to main content

School and Colleges Holidays Extended : స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు పొడిగింపు...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండ‌గ‌ సందర్భంగా అన్ని కాలేజీల‌కు, స్కూల్స్‌ల‌కు సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. అయితే.. తెలంగాణ‌లో ఇంటర్మీడియట్ కాలేజీల‌కు జనవరి 11 నుంచి జనవరి 16 వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు.
School and Colleges Holidays Extended  Sankranti festival holidays announcement for schools and colleges in Telangana  Holiday schedule for schools and colleges in Telugu states for Sankranti festival

అలాగే జనవరి 17న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే 18వ తేదీన శనివారం అవుతుంది. దీంతో కొన్ని పాఠశాలలు 20వ తేదీన తెరుచుకోనున్నాయి.

ఏపీలో మాత్రం...
ఏపీలోని జూనియర్ కాలేజీల‌కు జ‌న‌వ‌రి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే. ఈ సంక్రాంతి సెలవుల అనంతరం 20వ తేదీ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి.  అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్కూళ్లకు సంక్రాంతి సెలవులను జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇచ్చారు. అలాగే ఏపీ, తెలంగాణ‌లోని స్కూల్స్‌, కాలేజీల‌కు కూడా సంక్రాంతి సెల‌వులు పొడిగించే అవ‌కాశం ఉంది. దీనిపై ప్ర‌భుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే కొంద‌రు విద్యార్థులు మాత్రం స్కూల్స్‌కు సంక్రాంతి సెల‌వులు పొడిగించాల‌ని కోరుతున్నారు.

తమిళనాడులో 20వ తేదీ వరకు సెలవులు...
ఇక పొంగల్ వేడుకల కారణంగా తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు జనవరి 20 వరకు మూసివేయనున్నారు. 

ఫిబ్రవరి 28 వ తేదీ వ‌ర‌కు...
శీతాకాలపు చలి ఉత్తర భారతదేశంలో మరింత పెరగడంతో అనేక జిల్లాలు విద్యార్థులకు పాఠశాల సెలవులను పొడిగించాయి. చలి ప్రభావం పిల్లలపై చూపిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో పాఠశాల విద్యా శాఖ శీతాకాల సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు డిసెంబర్ 10, 2024 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు మూసివేయనున్నారు. అలాగే 6 నుంచి 12 తరగతుల పాఠశాలలు డిసెంబర్ 16, 2024 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు మూసి ఉండనున్నాయి.

➤☛ TS EAPCET Schedule 2025 : బ్రేకింగ్ న్యూస్‌.. ఈఏపీసెట్‌-2025తో పాటు వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ప్ర‌క‌ట‌న‌... ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే...?

జనవరి 20న పాఠశాలలు పునఃప్రారంభం..
లక్నోలోని పాఠశాలలు జనవరి 17న తిరిగి తెరుచుకోనున్నాయి. ఘజియాబాద్లోని ప్రైవేట్, ప్రీ-స్కూల్స్, అంగన్వాడీలతో సహా అన్ని పాఠశాలలు జనవరి 18 వరకు మూసివేయబడతాయి. తీవ్రమైన చలిగాలుల పరిస్థితుల కారణంగా 8వ తరగతి వరకు విద్యార్థులకు ఈ సెలవు వర్తిస్తోంది. మళ్లీ జనవరి 20న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మొరాదాబాద్, రాంపూర్, సంభాల్, ప్రయాగ్రాజ్, బదౌ లో కూడా పాఠశాల పరిస్థితి ఇదే. 

జనవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే :
జ‌న‌వ‌రి 2025 : 
➤☛ రిపబ్లిక్ డే – 26

ఫిబ్రవరి 2025 :
➤☛ మహ శివరాత్రి – 26

మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25

Published date : 16 Jan 2025 01:01PM

Photo Stories