Education News: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ..నేడు స్కూళ్లకు సెలవు... ఎందుకంటే
షబ్ ఎ మిరాజ్ సందర్భంగా తెలంగాణలోని పలు స్కూళ్లు, కాలేజీలకు జనవరి 28, 2025న సెలవు ప్రకటించాయి .దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా పేర్కొనగా మైనార్టీ విద్యాసంస్థలు హాలిడే ప్రకటించనున్నాయి.జనవరి 28న షబ్-ఇ-బరాత్ వేడుకలను ముస్లిం విద్యార్థులు కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు రేవంత్ సర్కార్ ఐచ్చిక సెలవు ప్రకటించింది.జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో రేపు షబ్ ఎ మిరాజ్‌కు ఆయా ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి.
షబ్-ఇ-మెరాజ్ ప్రత్యేకత ఏమిటి?
ఈ పవిత్రమైన రోజున ప్రార్థన చేస్తే ఆ అల్లా పాపపరిహారం చేస్తాడని ముస్లింల నమ్మకం. అందుకే దీన్ని 'క్షమాపణ రాత్రి' అని కూడా అంటారు. షబ్-ఇ-మెరాజ్ (Shab-e-Meraj) అంటే ఇస్లామిక్ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాత్రి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రభువు ఆదేశాలనుసారం అద్భుతమైన యాత్ర జరిగింది అని నమ్మబడుతుంది. "షబ్-ఇ-మెరాజ్" అనగా "రాత్రి యాత్ర" అని అర్థం.
ఇదీ చదవండి: IAS Kanishak Kataria Success Story: కోటి రూపాయల జీతం కాదని... దృఢ సంకల్పం, క్రమశిక్షణతో తొలి ప్రయత్నంలోనే సివిల్స్
ఫిబ్రవరిలో విద్యార్థులకు మొత్తం ఎన్నిరోజులు సెలవులంటే..
- ఫిబ్రవరి 2- వసంత పంచమి (సరస్వతీ దేవిని పూజిస్తారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సెలవు ప్రకటించారు)
- ఫిబ్రవరి 14- షబ్-ఎ-బరాత్ (ఆప్షనల్ హాలీడేగా ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లకు సెలవు దినంగా ఉంది)
- ఫిబ్రవరి 19- శివాజీ జయంతి (ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 19 న జరుపుకుంటారు మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు పాఠశాలలకు సెలవుగా ఉండనుంది)
- ఫిబ్రవరి 24- గురు రవిదాస్ జయంతి (ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి రోజున గురు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు. యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో సెలవుదినం)
- ఫిబ్రవరి 26- మహా శివరాత్రి (స్కూళ్లు, కాలేజీలకు ఆరోజున సెలవు ఉండనుంది).
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Shab-e-Miraj celebration 2025
- January 28
- 2025 Shab-e-Miraj
- Optional holiday on Shab-e-Miraj
- Shab-e-Miraj in Rajab month
- Minority institutions holiday for Shab-e-Miraj
- Importance of Shab-e-Miraj in Islam
- holiday update
- School Holiday News
- Jammu and Kashmir schools News
- Education News
- Sakshi Education News
- Today is a holiday
- State government holidays
- School holiday announcement