Skip to main content

IAS Kanishak Kataria Success Story: కోటి రూపాయల జీతం కాదని... దృఢ సంకల్పం, క్రమశిక్షణతో తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌

IAS Kanishak Kataria Success Story
IAS Kanishak Kataria Success Story

ప్రతిష్టాత్మక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్  ( UPSC ) పరీక్షలో విజయం సాధించడం అంటే సాధారణ విషయంకాదు. దానికి  కఠోర సాధన పట్టుదల ఉండాలి.  ఈవిషయంలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా  కథ  చాలా స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.

కోటి రూపాయల జీతం  ఇచ్చే ఉద్యోగ ఆఫర్‌ను కాదని తన  తొలి  ప్రయత్నంలోనే 2018 UPSC పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1ని సాధించాడు.  ఈ ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది అదేంటో తెలియాలంటే..  ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్రతి  ఏటా  లక్షలాది మంది అభ్యర్థులు  సివిల్స్‌కోసం ప్రిపేర్‌ అవుతారు. అందులో కొద్ది మంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా. ఐఐటీ బొంబాయి పూర్వ విద్యార్థి అయిన ఆయన కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ సంపాదించి తన రంగంలో అత్యుత్తమ ప్రతిభావంతుడిగా ఎదిగాడు.  ఆ తరువాత దక్షిణ కొరియాలోని శామ్‌సంగ్   కంపెనీలో సంవత్సరానికి కోటి రూపాయల జీతంతో  ఉద్యోగ ఆఫర్‌ కూడా వచ్చింది. అయితే, వ్యక్తిగత లాభాల కంటే దేశానికి సేవ చేయాలనే కోరిక అతనిలో బాగా నాటుకుపోయింది. అందుకే ఆ ఆఫర్‌ను మరీ తన కలలసాకారంకోసం పరీక్షకు సిద్ధం అయ్యాడు.

ఇవి కూడా చదవండి: ఇంట‌ర్ విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు బోర్డు చర్య‌లు.. ఈ స‌బ్జెక్టుల్లో ఏకంగా..

దృఢ సంకల్పం, క్రమశిక్షణతో  కూడిన అతని ప్రయత్నం వృధాకాలేదు. 2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు.  ఈ విజయంలో తన కృషి, పట్టుదలతోపాటు, కుటుంబ మద్దతు సహకారం చాలా ఉందని చెబుతాడు ఆనందంగా  కనిషక్‌.  స్పష్టమైన లక్ష్యం, సానుకూల మనస్తత్వంతో  ఎలాంటి సవాళ్లనైనా అధిగమించివచ్చని  నిరూపించాడు. తనలాంటి  ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.

మరోవిశేషం.. కుటుంబానికి గర్వకారణమైన క్షణాలు 
కనిషక్ విజయగాథలో మరో ఆసక్తికర విషయం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి.   2024 సెప్టెంబర్ 30ప రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో డివిజనల్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశాడు  కనిషక్‌ తండ్రి సన్వర్ మల్ వర్మ.  తండ్రి రాజీనామా ఉత్తర్వులపై సంతకం చేసింది మాత్రం కనిషక్‌. ఈ ప్రత్యేకమైన క్షణాలు ఆ కుటుంబానికి గర్వించ దగ్గ క్షణాలుగామారాయి. అంతేకాదు.   కుటుంబం అందించిన సేవ ,అంకితభాం మరింత ప్రత్యేకంగా నిలిచింది.

Kanishak Kataria

ఇవి కూడా చదవండి:  విద్యార్థినుల‌కు స్కాల‌ర్‌షిప్ ఆఫ‌ర్‌.. ద‌ర‌ఖాస్తుల‌కు అర్హులు వీరే.. ఎంపికైతే నెల‌కు..

వ్యక్తిగత  శ్రేయస్సు, సంపద కంటే సేవకు ప్రాధాన్యత ఇవ్వాలనే అతని నిర్ణయం కనిషక్‌ను ప్రత్యేకంగా నిలిపింది. శామ్సంగ్‌లో డేటా సైన్స్‌లో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని తిరస్కరించి, సమాజంలో అర్థవంతమైన మార్పును సృష్టించాలనే కోరికతో నడిచే సివిల్ సర్వీసెస్‌లో కెరీర్‌ను ఎంచుకోవడం విశేషం. దేశంకోసం దేశసేవకోసం  ఆర్థికంగా గొప్ప అవకాశాన్నిఉద్యోగాన్ని వదులుకొని, అతను భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచాడు. కృషి, అంకితభావం, స్పష్టమైన దృక్పథం ఉంటే ఏ కల కూడా సాధించలేనిది  లేదని మరోసారి నిరూపించాడు.  

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 28 Jan 2025 11:23AM

Photo Stories