Skip to main content

IFS Officer Success Story : ఏడు సార్లు వైఫల్యం ఈ క‌సితోనే చ‌దివి ఐఎఫ్‌ఎస్‌ అయ్యా ... నా సక్సెస్ సీక్రెట్ ఇదే..!

యూపీఎస్సీ సివిల్స్‌ ఎగ్జామ్‌ అన్నది చాలామంది యువత డ్రీమ్‌. కానీ దాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు. ఈ ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్‌ మాములుగా చుక్కలు చూపించదు. మూడు దశల ఎగ్జామ్‌లో ఎక్కడైనా ఏమరపాటుతో ఉన్నామో.. అంతే సంగతులు. అప్పటి దాక పడ్డ కష్టం క్షణంలో వృధా అయిపోతుంది. మళ్లీ మొదట నుంచి అంటే.. కన్నీళ్లు వచ్చేస్తాయి. అంత ఓపికతో వ్యవహరిస్తేనే తమ కలను సాకారం చేసుకోగలరు. అలాంటి వారెందరో ఉన్నారు కూడా. ఆ క్రమంలో కొందరూ ఎడతెగని వైఫల్యాలు ఎదర్కొంటే ఆత్మవిశ్వాసం శూన్యం అయిపోతుంది. అస్సలు గెలుపు అ‍న్నది జీవితంలో లేదేమో అన్నంతగా డీలా పడిపోతారు. దారులన్నీ మూసుకుపోయినట్లుగా అయిపోతుంది. అలాంటి కఠినతర పరిస్థితులను కొందరు మాత్రం ఎదురొడ్డి నిలబడిన తమ కలను సాకారం చేసుకుంటారు. అలాంటి కోవకు చెందిందే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వెన్నమ్‌ అనూష.
IFS Officer Success Story : ఏడు సార్లు వైఫల్యం ఈ క‌సితోనే చ‌దివి ఐఎఫ్‌ఎస్‌ అయ్యా ... నా సక్సెస్ సీక్రెట్ ఇదే..!

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన వెన్నమ్‌ అనూష​ సివిల్స్‌ ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌లో ఫేస్‌ చేసిన కష్టాలు చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి. బాబోయ్‌..! ఇంతలా భరిస్తూ అన్నిసార్లు ఎలా ప్రయత్నాలు చేసిందా..! అని ఆశ్చర్యపోతారు. అంతలా ఓటమిపాలవ్వుతున్నా..వెనక్కి తగ్గకుండా ఎప్పటికైనా గెలుపు తనని తప్పక వరిస్తుందన్న నమ్మకంతో ప్రయత్నించి విజయం సాధించింది. 

ఇదీ చదవండి:  IAS Kanishak Kataria Success Story: కోటి రూపాయల జీతం కాదని... దృఢ సంకల్పం, క్రమశిక్షణతో తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌       

ఆమె టీనేజ్‌లో ఉన్నప్పుడు కూడా కష్టాలను ఎదుర్కొంది. ఇంటర్మీడియెట్‌ వరకు టాపర్‌గా ఉన్నఆమె తండ్రి మరణంతో తీవ్ర మానసిక వేదనకు గురై వెనకబడింది. ఆ ప్రభావం బీటెక్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌పై పడి..అందులో ఉత్తీర్ణత సాధించడానికి నానా ఇబ్బందుల పడింది. చివరికీ..ఏదో రకంగా సీటు తెచ్చుకుంది.  అలా 2014లో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఐటీలో బీటెక్ పూర్తి చేసింది. 

ఆ తర్వాత కొన్నాళ్లు ఓ ప్రైవేటు జాబ్‌ చేసింది. ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి మరీ 2017 నుంచి సివిల్స్‌కి ప్రిపేరయ్యింది. ఇక అక్కడ నుంచి వరుసగా ఆ ఎగ్జామ్‌లో వైఫల్యాలే ఎదుర్కొంటూ వచ్చింది. అలా 2021 వరకు ఏడుసార్లు వైఫల్యం ఎదుర్కొంది. మొదటి ప్రయత్నంలో ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో జస్ట్‌ అర మార్కు తేడాతో పోయింది. పోనీలే అని మరోసారి రాస్తే.. ఈసారి మెయిన్స్‌. ఆ తర్వాత ఇంటర్వ్యూ రౌండ్‌కు చేరుకున్నాక తుది ఎంపికలో విఫలమైంది. అలా ఏకంగా ఏడుసార్లు వైఫల్యాలు చవిచూడటంతో పూర్తి నైరాశ్యంలో మునిగిపోయింది. 

ఇక ఏది గెలవలేనన్నా భయంతో డీలా పడింది. ఆ సమయంతో ఆమె గురువులో ఒకరు ఎందుకు యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ ప్రయత్నించకూడదు. ఇన్నిసార్లు ఓటిమిని ఎదర్కొన్నప్పుడూ.. సంపాదించిన జ్ఞానం వృధాగా పోదని ప్రోత్సహించడంతో అనూష ఆ దిశగా అడుగులు వేసింది. ఈసారి గెలుపు తలుపు తట్టింది. విజయం ఆమె ఒ‍ళ్లోకి వచ్చి వాలింది. 

ఇదీ చదవండి:   ప్రభుత్వం విద్యార్థులకు నెలకు రూ.1,000 నగదు ప్రోత్సాహక కానుక

యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ తొలి ప్రయత్నంలోనే 73వ ర్యాంకుతో అర్హత సాధించి ఐఎఫ్‌ఎస్‌​ అధికారిణి అయ్యింది. ఈమె కథ ఓటములు వరుస పెట్టి పలకరించి బాధల్లోకి నెట్టేస్తే..భయంతో పారిపోకూడాదనే పాఠాన్ని నేర్పడమే గాక అలాంటి సమయంలో గురువులు లేదా శ్రేయాభిలాషుల అండదండలతో పుంజుకోవాని ప్రూవ్‌ చేసింది. పైగా ఓటిమికి దాసోహం కాకూడదని చెబుతోంది. దేవుడు అన్నిదారులు మూసి వేసినా ఒక్క తలుపు మనకోసం తెరిచే ఉంచుతాడంటారు. కాకపోతే ఆ తలుపు ఏదో వెతికేందుకుకే సమయం పడుతుంది అంతే..!.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 28 Jan 2025 03:39PM

Photo Stories