CA 2nd Ranker Riya Kunjan Kumar Shah : పరీక్షకు ముందే అస్వస్థత.. సీఏలో 2వ ర్యాంకు.. ఇదే తన సక్సెస్ స్టోరీ..

సాక్షి ఎడ్యుకేషన్: ఎన్నో కఠినమైన పరీక్షల్లో సీఏ పరీక్ష ఒకటి. ఇందులో నెగ్గడం అనుకునేంత సులువు కాదు. ఇందులో ఇప్పటివరకు నెగ్గన వారు ఒకే ప్రయత్నంలో సాధించలేదు. కొందురు ఒకటి, మరికొందరు రెండు లేదా ఎక్కువే. మరి కొందరు ఒకే ప్రయత్నంలో గెలుపును అందుకున్నారు. గతంలో, అంటే.. డిసెంబర్ 2024 లో సీఏ ఫైనల్‌కు సంబంధించిన ఫలితాలు విడుదల చేశారు.
ఇందులో తొలి ప్రయత్నంలోనే రెండవ ర్యాంకు సాధించింది రియా కుంజన్‌కుమార్ షా. అసలు సీఏ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుంది..? నెగ్గడం అంత కష్టమా..? ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవాలి? ప‌్రతీ పరీక్షలాగే ఈ పరీక్షకు కూడా సిద్ధమవ్వచ్చా..? ఇలాంటి అనేక ప్రశ్నలకు రియా ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఈ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
రియా పూర్తి పేరు రియా కుంజన్‌కుమార్ షా. అహ్మెదాబాద్‌కు చెందిన విద్యార్థిని తను. అయితే, ఇంటర్ చదువుతున్న సమయంలో సీఏ గురించి తెలుకున్నా, ఇంటర్ పూర్తి చేసుకున్న తరవాతే తన సీఏ పరీక్షకు ప్రిపేర్ అవ్వడం ప్రారంభించింది. తాను 12వ తరగతిలో కామర్స్ చదివానని, ఇంటర్మీడియట్ తర్వాత సీఏకు ప్రిపేర్ కావడం ప్రారంభించానని రియా తెలిపింది. అలాగే బీకాం హానర్స్‌లో అడ్మిషన్ తీసుకుని.. సీఏ ప్రిపరేషన్ కొనసాగించినట్లు తెల్పింది.
తల్లిదండ్రులు, అన్నయ్య సహకారంతోనే..
సీఏ పరీక్షలు డిసెంబర్ 2024లో 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కొనసాగాయి. అన్ని పరీక్షలకు పూర్తిగా సిద్ధపడి రాసింది. అన్ని బాగానే జరిగాయి. కాని, చివరి పరీక్షకు రెండు రోజులు ముందు తీవ్ర జ్వరం రావడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. ఎలా రాయగలను, ఏం చేయాలి అని ఏమీ తోచని సమయంలో తన తల్లిదండ్రులు, తన సోదరుడు తనకు ఎంతో సహకరించారు, ప్రోత్సాహించారు. అయితే, ఈ క్రమంలో తాను ఎంత కష్టపడ్డా తన సక్సెస్ క్రెడిట్‌ను మొత్తం తమ తల్లిదండ్రులకు, తన అన్నయ్యకు ఇచ్చింది.
Chai Wale Baba IAS Coaching : నోరు తెరవకుండానే.. ఐఏఎస్ కోచింగ్ ఇస్తాడు ఇలా విచిత్రంగా..!
ప్రిపరేషన్ ప్లానింగ్..
సీఏ ప్రిపరేషన్ లో భాగంగా, రోజుకు కనీసం 12 గంటలు చదివేదని చెప్పుకొచ్చారు రియా. రోజూ ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేచి రాత్రి 8 గంటలకు నిద్రపోయేది. తన ఇంటర్ పూర్తి చేసుకున్న రియా డిగ్రీలో బీఏ హానర్స్‌లో ప్రవేశం పొందింది. అంతేకాదు, సీఏ ప్రిపరేషన్ కోసం ఆన్‌లైన్‌లోనే ప్రిపేర్ అయ్యింది. ఇలా, ప్రతీ రోజు తాను ఒక మంచి ర్యాంకు సాధించాలనే లక్ష్యంతోనే కృషి చేసింది. చివరికి పరీక్షలో 501 (83.50%) మార్కులతో సెకెండ్ ర్యాంకర్‌గా నిలిచింది.
ఫ్యూచర్ ప్లాన్..
ఇంటర్ పూర్తి చేసుకొని, సీఏకు ప్రిపేర్ అయ్యి దేశవ్యప్తంగా 2వ ర్యాంకు సాధించింది రియా. అయితే, తన సక్సెస్ జర్నీ గురించి వివరించిన రియా, తన పడ్డ కష్టం, ఎదరుకున్న అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తనకు ఉన్న ఫ్యూచర్ ప్లాన్‌లను సైతం పంచుకున్నారు. భవిష్యత్తులో తనకు కన్సల్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రంగంలో తన కెరీర్‌ను ప్రారంభించాలని ఆశ ఉంది అన్నారు. ఈ నేపథ్యంలోనే వేతనాల విషయంలో మాట్లాడుతూ సీఏగా నిలిచిన వ్యక్తికి ప్రారంభ వేతనంగా ఏడాదికి రూ.15 నుంచి 20 లక్షల వరకు వస్తుందని తెలిపింది.
చెప్పేది ఒక్కటే..
పరీక్ష ఏదైనా, ఎంత కఠనమై మన ప్రయత్నం ఆపకూడదు, ప్రణాళికను సరిగ్గా సిద్ధం చేసుకోవాలి. సాధారణంగా, మనం ఒక పని చేస్తే, అందులో ఒక ప్రణాళిక బద్దంగా చేస్తేనే అది సరిగ్గా, సరైన సమయంలో పూర్తి అవుతంది. అలాగే, ఒక పరీక్షకు సిద్ధం అయ్యే సమయంలో కూడా ఉన్న గడువును సిరిగ్గా ఉపయోగించుకొని ప్రణాళికను సిద్ధం చేసుకుంటే గెలుపు మీదే అవుతుంది. ప్రిపరేషన్‌తో రివిజన్ చేయడం చాలా ముఖ్యం. కోచింగ్ లేకుండానే ప్రిపేర్ అవ్వవచ్చని, అయితే కోచింగ్‌లో చేరడం వల్ల రొటీన్ ఏర్పడుతుందని, తద్వారా ప్రిపరేషన్ బాగుంటుందని సూచించింది. ఇతర విద్యార్థులు వారు ఎలాంటి పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా సరే వారు సరైన ప్రణాళిక, ప్రిపరేషన్, క్లాసెస్, రోజూవారి షెడ్యూల్ ప్రిపరేషన్ వంటివి పాటిస్తే గెలుపును చేరుకోవడం సులువుగానే ఉంటుందని సలహా ఇచ్చారు రియా.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Success Story
- Inspiring story of CA Rankers
- chattered accountants
- ca students latest stories
- ca rankers 2024
- top 5 ca rankers success story
- Success Stories
- latest success and inspiring stories of ca rankers
- preparation process for ca exam
- b com students
- chattered accountancy exam preparation tips
- toppers of ca 2024
- top chattered accountants 2024
- top 2 chattered accountant
- Top 2 chattered accountant Riya Kunjan Kumar Shah
- Top 2 chattered accountant Riya Kunjan Kumar Shah success story
- latest success stories of ca students in telugu
- Education News
- Sakshi Education News