Rashtrapati Bhavan : రాష్ట్రపతి భవన్‌లో మొదటి వివాహం.. ఎవరీ జంట..!!

సాక్షి ఎడ్యుకేషన్: ఎవరైనా, వారి వివాహం తమకు నచ్చిన చోటు నచ్చినట్లు చేసుకుంటారు. కొందరు సంప్రదాయంగా చేసుకుంటే మరికొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ విదేశాల్లో చేసుకుంటున్నారు. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న విధానాలను పాటిస్తూ వివాహాలు చేసుకుంటున్నారు. మరికొందరైతే, పెద్ద పెద్ద ప్యాసెస్‌లు, భవనాల్లో పెళ్లి చేసుకుంటున్నారు. కాని, ఇప్పుడు మనం తెలుసుకుంటున్న వ్యక్తి మాత్రం వీటన్నింటికి వేరుగా, ఏకంగా రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి పీటలు ఎక్కనున్నారంట ఒక జంట..!! ఇది ఎప్పుడైనా విన్నారా..?? లేదు కదా.. ఇదే తొలిసారి. ఇలా ఒక జంట ఫన్షన్ హాల్‌లో, ప్యాలెస్‌లో, విదేశాల్లో కాకుండా, ఇలా రాష్ట్రపతి భవన్‌లో వివాహం చేసుకుంటున్నారు. ప్రస్తుతం, ఈ వార్త తెగ చెక్కర్లు కొడుతుంది.
రాష్ట్రపతి భవన్‌లో సీఆర్‌పీఎఫ్ పెళ్లి..
ఎక్కడెక్కడో, ఎన్నో విధాలుగా ఇప్పుడు ఎందరో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా, వీరందరికంటే భిన్నంగా 2018లో యూపీఎస్సీ పరీక్ష రాసి దేశవ్యాప్తంగా 81వ ర్యాంకు సాధించి, సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా బాధ్యతలు చేపట్టి, బీహార్‌లోని నక్సల్స్ ప్రభావిత జోన్‌లో తన బలాన్ని, ధైర్యసాహసాల్ని కనబర్చి.. నేడు సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఎదిగిన పూనమ్ గుప్తా మాత్రం రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈనెల 12వ తేదీన వారి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే, అసలు ఈ పూనమ్ గుప్తా ఎవరు..? ఆమెకు ఇలా రాష్ట్రపతి భవన్‌లో వివాహం చేసుకోవచ్చని అనుమతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎలా ఇచ్చారు.
ఇక ఆమె కాబోయే భర్త అవినాష్ కుమార్ కూడా సీఆర్‌ఎఫ్ కమాండెంట్. ప్రస్తుతం అతడు జమ్ము కాశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ జంట వివాహం మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్‌లో జరగనుంది.

ఈ వివాహానికి ఇరువురి దగ్గరి కుటుంబ సభ్యలు మాత్రమే హాజరవుతారు. ఇలా రాష్ట్రపతి భవన్‌లో వివాహం చేసుకునే అదృష్టం ఈ జంటకు దక్కింది. మరి అదెలాగో తెలుసుకుందామా..!!
రాష్ట్రపతి భవన్ చరిత్ర..
భారతదేశ అత్యున్నత శక్తికి కేంద్రబిందువు రాష్ట్రపతి భవనం. అలాంటి అత్యున్నత గౌరవనీయ ప్రదేశంలో సీఆర్‌పీఎఫ్ అధికారిణి వివాహం ఫిబ్రవరి 12, 2025న రాష్ట్రపతి భవన్‌లో జరగనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. భారతదేశ రాష్ట్రపతి భవన్ ప్రపంచంలోనే రెండొవ అదిపెద్ద నివాసం. దీన్ని సర్ ఎడ్విన్ లుటియెన్స్ రూపొందించారు.
దీన్ని దాదాపు 300 ఎకరాల ఎస్టేట్‌లో నిర్మించారు. రాష్ట్రపతి భవన్‌లో మొత్తం నాలుగు అంతస్తులు, 340 గదులు ఉంటాయి. దీనితోపాటు అమృత్ ఉద్యాన్, మ్యూజియం, గణతంత్ర మండపం, అశోక మండపం, రాగి ముఖం గల గోపురం కూడా ఉన్నాయి. అంతేగాదు 1948 స్వతంత్ర భారతదేశంలో తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి ఈ రాష్ట్రపతి భవన్‌లో నివశించిన తొలి భారతీయుడు.
అలా ఎందరో రాష్ట్రపతులు ఈ భవన్‌లో నివశించారు. అలాగే ఎందరో ఉన్నతస్థాయి ప్రముఖులు ఇందులో ఆతిథ్యం పొందారు. అలాంటి ఘన చరిత్ర గలిగిన ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్‌లో సీఆర్‌పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా వివాహం మరి కొన్ని రోజుల్లోనే జరగనుంది.
వృత్తి నిబద్ధత..
సీఆర్‌పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా రాష్ట్రపతి భవన్‌లో పీఎస్‌ఓగా నియమితులయ్యారు. ఆమె 74వ గణతంత్ర దినోత్సవం పరేడ్(74th Republic Day Parade)లో పూర్తిగా మహిళా బృందానికి నాయకత్వం వహించింది. అలాగే పూనమ్ వృత్తిపరంగా నిబద్ధతగా, అంకితభావంతో పనిచేసే ప్రవర్త నియమావళే ఆ అదృష్టాన్ని పొందేలా చేసింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెకు అనుమతిచ్చారు. దీంతో పూనమ్ ఇలా రాష్ట్రపతి భవన్‌లో వివాహం చేసుకున్న తొలిగా వ్యక్తి చరిత్ర సృష్టించనుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- crpf officer
- Rashtrapati Bhavan
- marriage at rashtrapati bhavan
- first marriage
- President Draupadi Murmu
- 74th republic parade
- Professionalism
- crpf officer poonam gupta
- crpf officer poonam gupta marriage
- first marriage at rashtrapati bhavan
- crpf officers
- Professionalism of CRPF Officer Poonam Gupta
- Education News
- Sakshi Education News