JEE Main Topper Success Story :జేఈఈ మెయిన్‌లో 360/360 మార్కులు సంపాదించి... లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం.... కానీ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లలేదు.. ఎందుకంటే

ఉదయపూర్‌లోని మహారాణా భూపాల్‌కి చెందిన వ్యక్తి కల్పిత్ వీర్వాల్. లక్షలాది మంది డ్రీమ్ ఐఐటీ జేఈఈ2017లో ఉత్తీర్ణత సాధించాడు. దాన్ని కల్పిత్ అత్యంత అలవొకగా సాధించేశాడు. ఇక్కడ కల్పితేమి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. పెద్ద బ్యాగ్రౌండ్ ఏమి లేదు కూడా.
తల్లి ఓ ప్రైవేటు టీచర్ కాగా, తండ్రి కాంపౌడర్. అలాగే కల్పిత్ జేఈఈ ప్రిపరేషన్ కోసం అందరిలా ఏకంగా 16 గంటలు చదివిన వ్యక్తి కూడా కాదు. అలాగే కోచింగ్ సెంటర్లలోనే ఉండిపోయి ప్రిపేరయ్యేలా పలు సంస్థలు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ముందుక వచ్చినా.. వాటిని కూడా ఇష్టపడకుండా తన ఇంటి నుంచి ప్రిపేరయ్యేందుకే మొగ్గు చూపాడు. ఇక జేఈఈ మెయిన్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా, ఎవ్వరూ బ్రేక్ చేయని రేంజ్‌లో 360/360 మార్కులు సంపాదించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కించుకున్నాడు.
అంతేగాదు అతనికి కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (KVPY) స్కాలర్, నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్ (NTSE) వంటి ఎన్నో ప్రోత్సాహక స్కాలర్‌షిప్‌లను సొంతం చేసుకున్నాడు. అయితే అందరిలా IIT బాంబే కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో చేరినా.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఐఐటీ రెండో సంవత్సరంలోనే ఒక YouTube ఛానెల్‌ను ప్రారంభించాడు. అక్కడ తన అధ్యయన వ్యూహాలను , JEE ప్రిపరేషన్ చిట్కాలను పంచుకున్నాడు.
దీనికి అనతికాలంలోనే అనూహ్యస్పందన వచ్చింది. అతడిచ్చే సలహాలు ఆచరణాత్మకంగా ఉండేవి. విద్యార్థులంతా సాధారణ కోచింగ్ సెంటర్‌లు బోధించే దానికి భిన్నంగా ఉందంటూ ఇంప్రెస్ అయ్యేవారు. అలా అతని యూట్యూబ్ ఛానెల్‌కి లక్షకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఫాలోయింగ్ ఉండేది. తన ఛానెల్‌కి ఉన్న డిమాండ్ దృష్ట్యా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు.
అలా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయపడే ఆన్‌లైన్ విద్యా వేదిక అయిన AcadBoostను కల్పిట్ ప్రారంభించాడు. మరసుటి ఏడాదే తన తొలి ఆన్‌లైన్ కోర్సుని డెవలప్ చేశాడు. అది విజయవంతమైంది. అలా అతను తన ఐఐటీ క్యాంపెస్ ప్లేస్‌మెంట్‌లలో వచ్చే ప్యాకేజ్‌లకు మంచి ఆదాయాన్ని ఈ ఆన్‌లైన్ వేదిక AcadBoostతో ఆర్జించాడు. అలాగే తన ఐఐటీ బాంబే ప్రోగ్రామ్‌లో ఒక సెమిస్టర్ ముందుగానే ముగించాడు.
ఇదీ చదవండి : UPSC Applications Last Date : గుడ్ న్యూస్.. యూపీఎస్సీ దరఖాస్తుల తేదీ పొడగింపు.. ఎప్పటివరకు అంటే..!!
ఆ తర్వాత పూర్తిస్థాయిలో అకాడ్‌బూస్ట్ టెక్నాలజీస్‌లో పనిచేసేవాడు. దీంతో 2021 నాటికి, లింక్డ్ఇన్ 'టాప్ వాయిసెస్'లో కల్పిత్‌కి స్థానం ఇచ్చింది. అలా 20 మంది అత్యుత్తమ యువ నిపుణుల జాబితాలో కల్పిత్ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేగాకుండా టెడ్‌ఎక్స్‌లో తన జేఈఈ మంచిస్కోర్‌కి సంబంధించిన సక్సస్ జర్నీని షేర్ చేసుకున్నాడు. ఇక్కడ కల్పిత్ కేవలం విద్యా విషయాలకే కట్టుబడి ఉండలేదు.
అతను సీనియర్ NCC క్యాడెట్ అయ్యాడు, కఠినమైన తుపాకీ కసరత్తులు, శిబిరాలు శిక్షణ తర్వాత ఎన్సీసీ ఏ సర్టిఫికేట్‌ని కూడా సంపాదించాడు. అలాగే JEEకి సిద్ధమవుతున్నప్పుడు కూడా, అతను క్రికెట్, టీవీ, బ్యాడ్మింటన్, సంగీతం కోసం సమయం కేటాయించేవాడు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ఎడ్‌టెక్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినా..నిరాకరించాడు. తన కంటూ ఓ అచంచలమైన లక్ష్యంతో విభ్నింగా ఉండాలనుకున్నాడు, అలానే జీవించి ఎందరికో ప్రేరణగా నిలిచాడు.
ఇదీ చదవండి:Telangana job Calendar Upcoming jobs
ఇక్కడ విజయం అంటే కేవలం మార్కులు కాదని, దృష్టి, వ్యూహాలకు సంబంధించినదని ప్రూవ్ చేశాడు. ఎన్ని గంటలు చదివామన్నది కాదు..ఎంత బాగా చదువుతున్నాం, ఎంత నాలెడ్జ్‌ని పొందుతున్నాం అన్నదే ముఖ్యం అని చాటిచెప్పాడు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Tags
- JEE Main 2017 Topper Kalpit Veerwal
- JEE Main Topper Kalpit Veerwal Success Story
- Kalpit Veerwal makes it to Limca Book of Records
- JEE topper who created record by scoring 360 out of 360
- JEE Main success story
- Kalpit Veerwal biography
- JEE Main preparation tips
- how to score 360 in JEE Main
- Kalpit Veerwal JEE Main 2017
- JEE Main full marks
- JEE Main perfect score
- Kalpit Veerwal study plan
- IIT Bombay
- sakshieducationsuccess stories