Skip to main content

Tata Steel Chess Masters: గుకేశ్‌ను ఓడించి.. ఛాంపియన్‌గా నిలిచిన ప్రజ్ఞానంద

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌-2025 టోర్నీ విజేతగా భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్ ప్రజ్ఞానంద నిలిచాడు.
Praggnanandhaa Beats Gukesh In Tata Steel Chess 2025 Masters

నెదర్లాండ్స్‌లోని విక్‌ ఆన్‌ జీ వేదికగా జరిగిన టై బ్రేకర్‌లో వరల్డ్ ఛాంపియన్‌​ డి గుకేశ్‌పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. కాగా అంతకుముందు చివరి రౌండ్‌లో గుకేశ్‌, ప్రజ్ఞానానంద ఇద్దరూ తమ మ్యాచ్‌లలో ఓడిపోయారు.

జర్మన్ గ్రాండ్ మాస్టర్ జీఎమ్ విన్సెంట్ ప్రగ్నందందాను ఓడించగా.. గుకేష్‌ను అర్జున్ ఎరిగైసి ఖంగుతిన్పించాడు. దీంతో 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న గుకేశ్, ప్రజ్ఞానంద.. టైటిల్‌ కోసం టైబ్రేకర్‌లో తలపడ్డారు. టైబ్రేకర్‌లో తొలి గేమ్‌లో గుకేష్ విజయం సాధించగా, రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద గెలుపొందాడు.
 
ఫలితంగా విజేతను తేల్చేందుకు సడన్‌ డెత్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో ప్రజ్ఞానంద విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 

ఈ టోర్నీ చివరి రౌండ్‌(13వ రౌండ్‌​)లో ప్రజ్ఞానంద 2741 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలవగా.. దొమ్మరాజు గుకేశ్‌(2777) రెండో స్ధానంలో నిలిచాడు.

U19 T20 World Cup: వరుసగా రెండోసారి అండర్‌–19 మహిళల టీ20 ప్రపంచకప్ సాధించిన భారత్‌

Published date : 05 Feb 2025 08:53AM

Photo Stories