India-Indonesia Relations: ఇండియా–ఇండోనేసియాది తరాల బంధమన్న మోదీ
Sakshi Education
భారత్, ఇండోనేసియాల మధ్యనున్నది కేవలం భౌగోళికరాజకీయం సంబంధం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

రెండు దేశాలది వేల ఏళ్లుగా పెనవేసుకుపోయిన బంధమని చెప్పారు. రెండు దేశాల భిన్నత్వంలో ఏకత్వమనే సంప్రదాయం కొనసాగుతోందని తెలిపారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో సనాతన ధర్మ ఆలయంలో ఫిబ్రవరి 2వ తేదీ జరిగిన మహా కుంభాభిషేకం సందర్భంగా వర్చువల్‌గా ప్రధాని మోదీ ప్రసంగించారు.
జకార్తాలోని మురుగన్ ఆలయంలో అభిషేక ఉత్సవాల్లో పాలుపంచుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఇండోనేసియా ప్రజలు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. స్కంధ షష్ఠి కవచం ప్రజలను అన్ని వేళలా కాపాడాలని ఆకాంక్షించారు. మురుగన్ ఆలయంలో తిరుప్పుగల్ శ్లోకాలతో పూజలు కొనసాగాలన్నారు. ‘మనమంతా మురుగన్, శ్రీరాముడు, బుద్ధుని సంబందీకులమని మోదీ అన్నారు.
India US Rrelations: భారత్‌తో అమెరికా వాణిజ్య సంబంధాల బలోపేతం
Published date : 04 Feb 2025 03:13PM