Skip to main content

February 14th Schools Holiday 2025 : గుడ్‌న్యూస్‌.. ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ స్కూల్స్‌కు సెల‌వు ప్ర‌క‌ట‌న‌.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌ల కాలంలో స్కూల్స్‌కు అనుకోకుండా సెల‌వులు వ‌స్తున్నాయి. కొత్త సంవ‌త్స‌రం ప్రారంభం నుంచి విద్యార్థులుకు సంక్రాంతి పండ‌గ రూపంలో సెలవులు భారీగానే వచ్చాయి.
February 14th Schools Holiday 2025   February 14th school holiday announcement Government announces optional holiday for Shab-e-Barat

అలాగే ఎదో ఒక కార‌ణంతో.. అనుకోకుండా సెల‌వులు రావడంతో... స్కూల్స్ విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. ఇలాగే ఫిబ్రవరి 14వ తేదీ (శుక్ర‌వారం) స్కూళ్లకు మ‌రో సెల‌వు రానుంది.

కార‌ణం ఇదే..!
ఫిబ్రవరి 14వ తేదీ ముస్లింలకు పవిత్రమైన రాత్రి. ఈరోజు 'షబ్‌ ఏ బరాత్‌' సందర్భంగా.. మరోసారి స్కూళ్లకు సెలవు రానుంది. మతపెద్దలు ఈ తేదీని ఖరారు చేశారు. అయితే ప్రభుత్వం సాధారణ సెలవు కాకుండా ఆప్షనల్‌గా ప్రకటించింది.  దీంతో కొన్ని మైనారిటీ పాఠశాలలకు ఫిబ్రవరి 14వ తేదీన సెలవు ప్ర‌క‌టించారు. నెలవంక కనిపించడంతో.. ఆ రోజున షబ్‌ ఏ బరాత్‌ నిర్వహించాలని నిర్ణయించారు. మరికొన్ని పాఠశాలలు మరుసటి రోజు సెలవు పాటిస్తాయి.

☛➤ TS TET Result 2025 : రేపే టీఎస్ టెట్ ఫ‌లితాలు విడ‌ద‌లు.. అలాగే డీఎస్సీ నోటిఫికేష‌న్ కూడా...

జనవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే.. :
ఫిబ్రవరి 2025  :

➤☛ ఫిబ్రవరి 15 : 'షబ్‌ ఏ బరాత్‌'
➤☛ మహ శివరాత్రి – 26 ఫిబ్రవరి 

మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
➤☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26

Published date : 04 Feb 2025 03:33PM

Photo Stories