Courses and Notifications 2025 : ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్స్.. ముఖ్యమైన తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్: 2025-26 విద్యాసంవత్సరంలో పలు కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూళ్లను సోమవారం, ఫిబ్రవరి 3వ తేదీన విడుదల చేశారు. టీజీ ఈఎపీసెట్, ఏపీఈఏపీసెట్, పీజీ సెట్, ఐసెట్ తదితర ప్రవేశ పరీక్షల కమిటీల సమావేశంలో ఆయా కోర్సులకు సంబంధిత పరీక్షల షెడ్యూల్‌లను విడుదల చేశారు.
టీజీ ఈఏపీసెట్..
ఫిబ్రవరి 20వ తేదీన టీజీ ఈఏపీసెట్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలకు ఆన్ లైన్లో ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించారు.
University of Hyderabadలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక!
పీజీసెట్..
ఎంసెట్, ఎంఏ వంటి మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు మార్చి 12న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను మార్చి 17 నుంచి మే 19 వరకు స్వీకరిస్తారు. ఈ తేదీల్లో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఐసెట్..
ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలు దక్కేందుకు విద్యార్థులు టీజీ ఐసెట్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు దరఖాస్తుల ప్రక్రియ వచ్చేనెల మార్చి 10 నుంచి ప్రారంభం అవుతుంది. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల కాగా, మార్చి 10 నుంచి మే 3 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
Backlog Recruitments : కలెక్టర్‌కు దివ్యాంగుల ఫిర్యాదు.. సమస్యలివే..
పరీక్షలు.. తేదీలు..
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ నిర్వహించనుండగా, మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు ఎగ్జామ్స్ జరగనునున్నాయి.
మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు పరీక్షలు జరుగుతాయి.
పీజీ సెట్ పరీక్షల్లో.. జూన్16 నుంచి 19 వరకు జరుగుతాయి.
Telangana Gurukul Admissions : గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే
ఐసెట్ పరీక్షలు జూన్ 8, 9న రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది. కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగ అభ్యర్థులకు రూ.550, ఇతర విద్యార్థులకు రూ.750 అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు.
ఇకపై ఫీజు తప్పనిసరి..
జేఈఈ మాదిరిగానే ఇతర ప్రవేశ పరీక్షల విద్యార్థులకు కూడా వారి పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీ విడుదల చేసిన తరువాత వారి అభ్యంతరాలకు 500 చెల్లించాల్సిందే అని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఆబ్జెక్షన్ కు రూ. 500 కట్టాల్సిందేనని కౌన్సిల్ అధికారులు నిర్ణయించారు. అంతేకాదు, ఒకవేళ, అభ్యర్థుల జవాబులు సదైనదే అయితే, వారు చెల్లించిన డబ్బులు వారికే దక్కుతుందని వివరించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Admissions 2025
- notifications for admissions 2025
- engineering and pharmacy courses
- courses and notifications 2025
- new academic year 2025
- degree and masters courses
- Entrance Exams
- ap eapcet notification 2025
- preliminary key
- online applications for entrance exams
- academic year entrance exams
- icet exams notification 2025
- notification and exams dates 2025
- entrance exams 2025
- pg cet notification 2025
- entrance exams and admissions for 2025
- colleges and universities
- admissions for colleges and universities
- JNTU
- JNTUH
- Education News
- Sakshi Education News