February School Holidays 2025: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరిలో విద్యార్థులకు మొత్తం ఎన్నిరోజులు సెలవులంటే..
Sakshi Education
సెలవులంటేనే విద్యార్థులకు ఎక్కడలేని సంతోషం.. ఈ నెలలో సంక్రాంతి, రిపబ్లిక్ డే.. ఇలా అనేక సెలవులు వచ్చాయి. త్వరలోనే జనవరి నెల పూర్తయ్యి ఫిబ్రవరిలోకి అడుగుపెడుతున్నాం. ప్రారంభంలోనే ఫిబ్రవరి 2న వసంత పంచమికి పలు ప్రాంతాల్లో ఇప్పటికే పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో జరుపుకునే పండుగలు, సెలవుల లిస్ట్‌ను చూసేద్దామా..
February School Holidays 2025
ఫిబ్రవరి నెలలో కూడా ఎక్కువగానే సెలవులు వస్తున్నాయి. వసంత పంచమి, శివాజీ జయంతి, గురు రవిదాస్ జయంతితో పాటు మహా శివరాత్రి కూడా ఈనెలలోనే ఉండనుంది. అంతేకాకుండా ఫిబ్రవరి నెలలో 2, 9, 16, 23 లేదీల్లో ఆదివారం వస్తున్నాయి. ఈ రోజుల్లో ఎలాగో సెలవు రోజులే. అలాగే, ఫిబ్రవరి 15న రెండో శనివారం కావడంతో అది మరో సెలవు రానుంది. వీటితో పాటు ఫిబ్రవరి నెలలో మొత్తం ఎన్ని సెలవులంటే..
ఫిబ్రవరి 2- వసంత పంచమి (సరస్వతీ దేవిని పూజిస్తారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సెలవు ప్రకటించారు)
ఫిబ్రవరి 14- షబ్-ఎ-బరాత్ (ఆప్షనల్ హాలీడేగా ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లకు సెలవు దినంగా ఉంది)
ఫిబ్రవరి 19- శివాజీ జయంతి (ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 19 న జరుపుకుంటారు మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు పాఠశాలలకు సెలవుగా ఉండనుంది)
ఫిబ్రవరి 24- గురు రవిదాస్ జయంతి (ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి రోజున గురు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు. యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో సెలవుదినం)
ఫిబ్రవరి 26- మహా శివరాత్రి (స్కూళ్లు, కాలేజీలకు ఆరోజున సెలవు ఉండనుంది).