September 18th Holiday 2024 : గుడ్‌న్యూస్ .. రేపు, ఎల్లుండి స్కూల్స్, కాలేజీలకు సెలవు.. ప్రకటించిన ప్రభుత్వం.. ఎందుకంటే..?
ఇప్పుడు ఈ సందర్భంగా సెప్టెంబరు 16కి బదులు సెప్టెంబర్ 18న సెలవు రోజుగా ప్రకటించింది. ఆ రోజు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉండనుంది. ముస్లిం సమాజానికి చెందిన స్థానిక నాయకుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈద్-ఎ-మిలాద్‌కు సెప్టెంబర్ 16కి బదులుగా సెప్టెంబర్ 18న సెలవు ప్రకటించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు నసీం ఖాన్ ఇటీవల ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు విజ్ఞప్తి చేశారు.
సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో..
సెప్టెంబరు 17న, ముస్లిం సమాజం సెప్టెంబర్ 18న ఈద్-ఇ-మిలాద్ ఊరేగింపును నిర్వహించాలని నిర్ణయించుకుంది. తద్వారా రెండు పండుగలను వైభవంగా, ఉత్సాహంగా జరుపుకోవచ్చు. గణేష్ ఉత్సవ్ చివరి రోజు సెప్టెంబర్ 17వ తేదీ న వస్తుంది. ఈద్-ఇ-మిలాద్ సెప్టెంబర్ 16వ తేదీన ఉంది. అయితే ఇది చంద్రుని స్థానం ప్రకారం కూడా మారవచ్చు. మైనార్టీ నాయకుల లేఖతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఈద్-ఎ-మిలాద్ అధికారిక సెలవును సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 18 వరకు పొడిగించింది. దాని అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 1) పంకజ్ దహనే ప్రకారం.. గత సంవత్సరం కూడా ముస్లిం సమాజం గణపతి నిమజ్జనాన్ని పూర్తి ఉత్సాహంతో జరుపుకోవడానికి వీలుగా తమ మతపరమైన కార్యకలాపాలను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థించింది. ఇది ఇరు వర్గాల ఐక్యతను తెలియజేస్తోందన్నారు. ముంబైలోని ఈద్-ఎ-మిలాద్ ఊరేగింపు తుర్భే నుంచి ప్రారంభమై వాషి, కోపర్‌ఖైరానే మీదుగా ఘన్సోలీ దర్గా వద్ద ముగుస్తుంది.
తెలంగాణలో కూడా..
గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబరు 17న జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవుదినంగా ప్రకటించారు. అయితే ఆరోజు సెలవు ఇస్తుండటంతో నవంబరు 9న రెండో శనివారం పనిదినం(వర్కింగ్‌డే)గా ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు నెలలో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ నెలలో ఇప్పటికే విద్యాసంస్థలకు చాలా సెలవులు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో కొన్ని రోజులు సెలవులు ఇచ్చారు. అదే విధంగా వినాయక చవితి, పండగల నేపథ్యంలో సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ నెలలో ఇంకా ఉన్న సెలవుల వివరాలు చూస్తే.. 22 ఆదివారం సెలవు. అదే విధంగా సెప్టెంబర్ 28 నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు ఉంది. సెప్టెంబర్ 29న ఆదివారం వస్తోంది.. కాబట్టి ఆరోజు కూడా అందరికీ సెలవురోజే.
ఒడిశాలో కూడా సెప్టెంబర్ 17వ తేదీన..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలోని భువనేశ్వర్‌లో సెప్టెంబర్ 17వ తేదీన
Subhadra Yojana ప్రథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన భువనేశ్వర్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌కు , కాలేజీలకు సెలవు ప్రకటించారు.
ఈ నెలలో వరుస సెలవులు వస్తుండటంతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి తోడు పండగలు కూడా రావడంతో తమ తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు.
Tags
- Tomorrow All Schools and Colleges Holiday 2024
- Good News September 18th All Schools and Colleges Holiday 2024 News in Telugu
- september 18th holiday
- september 18th holiday for schools
- september 18th holiday for schools news
- september 18th holiday for colleges news telugu
- september 17th holiday news in telangana
- Trending september 17th holiday news
- september 17th holiday
- september 17th holiday news telugu
- 17th september public holiday
- 17th september public holiday news telugu
- telugu news 17th september public holiday news telugu
- telugu news 18th september public holiday news telugu
- Ganesh Visarjan
- Eid E Milad
- eid e milad holiday in india
- eid e milad holiday in india news telugu
- eid e milad holiday for schools
- eid e milad holiday for schools news telugu
- september 18th holiday due to festival
- september 17th and 18th holiday due to festival
- september 17th and 18th holiday due to festival news telugu
- GovernmentEmployeesHoliday
- SeptemberHolidays
- GovernmentDecision
- Eid-e-Milad
- MumbaiHoliday
- MuslimCommunity
- EducationalInstitutions