Sai Shraddha: విద్యార్థినికి సీఎం ఆర్థికసాయం
Sakshi Education
జైనూర్: నీట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పేదింటి విద్యా కుసుమం సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్టోబర్ 31న ఆర్థికసాయం అందజేశారు.
మండలంలోని జెండాగూడ గ్రామానికి చెందిన మెస్రం న్యానేశ్వర్ –లక్ష్మి దంపతుల కుమార్తె సాయిశ్రద్ధ నీట్‌లో ఎస్టీ కోటాలో 103వ ర్యాంకుతో మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది.
చదవండి: Students Reading Books: విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించాలి
పేద కుటుంబం కావడంతో కాలేజీలో చేరేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ సాయిశ్రద్ధ పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం సా యిశ్రద్ధ ఎంబీబీఎస్ పూర్తి అయ్యే వరకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా వైద్యవి ద్యకు అవసరమైన పూర్తి మొత్తం ఆర్థికసాయం చేసినట్లు సాయిశ్రద్ధ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Published date : 01 Nov 2024 02:22PM
Tags
- CM Financial Support
- neet 2024
- NEET 2024 Results
- Sai Shraddha
- telangana cm revanth reddy
- NEET ST Quota 103 Rank
- Manchryala Government Medical College
- MBBS
- medical education
- Adilabad District News
- Telangana News
- RevanthReddy
- neet2024
- FinancialAssistance
- TelanganaScholarships
- TelanganaNews
- ManchryalaMedicalCollege
- skshieducationupdates