OET for Medical Professionals: మెడికల్ ప్రొఫెషనల్స్ కోసం ఓఈటీ
చాలామందికి జీఆ స్ఈ, టోఫెల్, ఐఈఎల్డీఎస్, డులింగో వంటి పరీక్షల గురించే తెలుసు. కానీ అవి కాకుండా వేరే పరీక్షలతో కూడా మనం విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందచ్చని తెలుసా?.
మెడికల్, నర్సింగ్, ఫార్మసీ చేసిన వారికి ప్రత్యేకంగా టెస్ట్ ఉంటుందని చాలా మందికి తెలియకపోవచ్చు. దానికి సంబం ధించిందే ఆక్యుపేషనల్ ఇంగ్లిష్ టెస్ట్ (ఓఈటీ). ఓఈటీ దక్షిణాసియా రీజనల్ డైరెక్టర్ అమిత్ ఉపా ధ్యాయ్ నగరానికి వచ్చిన సందర్భంగా 'సాక్షి' ఆ యన్ను పలకరించింది. ఓఈటీతో హెల్త్కేర్ ప్రొఫెష నల్స్కు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏయే కాలేజీల్లో చేరే అవకాశం ఉంటుందనే అంశాలను ఆయన వివరించారు.
ఓఈటీ పరీక్ష చాలా సులువు
వేరే పరీక్షలతో పోలిస్తే ఓఈటీ చాలా సులువుగా ఉంటుందని ఉపాధ్యాయ్ చెప్పారు. ఎంబీ బీఎస్, నర్సింగ్, ఫార్మసీ కోర్సుల్లో చదివిన అం శాలు కేంద్రంగా ఓఈటీ పరీక్ష ఉంటుందన్నారు. అకడమిక్ స్థాయిలో చదువుకున్న అంశాలే ఈ పరీ క్షలో కూడా ఉంటాయని తెలిపారు.
విదేశాల్లో స్థిర పడాలనుకునే హెల్త్కేర్ ప్రొఫెషనల్స్ కోసం ఈ పరీ క్షను ప్రత్యేకంగా రూపొందించామని వెల్లడించారు. దీన్ని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టిమ్ మెకనమరా 40 ఏళ్ల కింద అభివృద్ధి పరిచారని తెలిపారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ప్రస్తుతం కేంబ్రిడ్జి బాక్సిల్ లాంగ్వేజ్ అసెస్మెంట్ యూనిట్ ట్రస్ట్ నిర్వహి స్తోందన్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్ సహా అనేక దేశాలు ఈ పరీ క్షకు ఆమోదం తెలిపాయని, ప్రపంచంలోని 500 యూనివర్సిటీలు ఈ పరీక్ష ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తున్నాయని అమిత్ వెల్లడించారు. ఉద్యోగ సమ యంలో ఎదురయ్యే క్షేత్రస్థాయి పరిస్థితులకు సన్న ద్దమయ్యేందుకు ఈ పరీక్ష కీలకంగా వ్యవహరిస్తుం
దాని వివరించారు.
కేరళలో ఎక్కువగా..
ఓఈటీ పరీక్షను కేరళలో ఎక్కువ మంది రాస్తుంటారని, కొన్ని వేల మంది ఈ పరీక్ష రాసి అక్కడి నుం చి వెళ్లి విదేశాల్లో స్థిరపడ్డారని అమిత్ గుర్తు చేశారు. తెలంగాణ, ఏపీ నుంచి కూడా చాలా మంది ఈ పరీక్ష రాసేలా అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగా ణలోని పలు మెడికల్, నర్సింగ్ కాలేజీలు తమతో ఒప్పందం చేసుకునేందుకు ముందుకొచ్చాయని, సమీప భవిష్యత్తులో ఈ ఒప్పందాలు పూర్తవుతాయని తెలిపారు.
ఉచిత శిక్షణ
తమ వెబ్సైట్లో ఉచితంగా ఓఈటీ పరీక్ష కోసం సన్నద్ధమయ్యేందుకు వెసులుబాటు కల్పించామని అమిత్ చెప్పారు. ఇప్పటికే చాలా కాలేజీలు వెబ్సైట్లోని ఓఈటీ కోర్సును చివరి సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశాల్లో చేర్చాయని, దక్షిణ భారత్లో ఇప్పుడిప్పుడే ఓఈటీపై చాలా మందికి అవ గాహన పెరుగుతోందని తెలిపారు.
వినడం, చదవడం, రాయడం, మాట్లాడటం వంటి నాలుగు అంశాల్లో ఓఈటీ పరీక్ష ఉంటుంద న్నారు. ఏ, బీ, సీ, డీ, ఈ గ్రేడ్ల రూపంలో మార్కులు ఇస్తారని, ఈ గ్రేడ్స్ బీ, బీ, బీ, సీప్లస్ గ్రేడ్స్ సాధించిన వారికి వర్సిటీల్లో అడ్మి షన్లు ఇస్తారని అమిత్ వెల్లడించారు. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారే కాకుండా సొంత దేశం లో కూడా వారి ప్రొఫెషన్ లో మంచి స్కిల్స్ పెంపొందించుకోవాలనుకునే వారికి కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.