Skip to main content

October Month Holidays 2024 : అక్టోబర్ నెల‌లో స్కూల్స్, కాలేజీలు, ఆఫీసుల‌కు భారీగా రానున్న‌ సెల‌వులు ఇవే.. నెల‌లో స‌గం రోజులు హాలిడేస్..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : అక్టోబ‌ర్ నెల‌లో స్కూల్స్, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు భారీగా సెల‌వులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండ‌గైన ద‌స‌రా, దీపావళి ఇదే నెల‌లో అక్టోబ‌ర్‌ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వాలు ఈ సారి ముందుగానే ద‌స‌రా సెల‌వుల తేదీల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే.

తెలంగాణ‌లో బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి ఒకేసారి తెలంగాణ విద్యాశాఖ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.  తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే హాలీడేస్ ను ప్ర‌క‌టించారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

ఈ సారి ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మొత్తం 10 రోజులు సెలవులను ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌క‌టించి ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దపండుగలో దసరా, సంక్రాంతిలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు పండ‌గ‌ల‌కు ప్ర‌భుత్వం ప్ర‌తి ఏడాది భారీగా సెల‌వులు ఇస్తున్న విష‌యం తెల్సిందే. ఈ పండుగలను తెలుగు ప్రజలు అంగరంగవైభవంగా చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని సూళ్లకు ప్రభుత్వం ద‌స‌రా పండుగ సెలవులను ప్రకటించింది. ఈ మేర‌కు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ అకడమిక్ క్యాలెండర్‌లో గ‌తంలో విడుదల చేసిన విష‌యం తెల్సిందే. అలాగే అక్టోబ‌ర్ నెల‌లో మ‌రో పండ‌గ దీపావళి అక్టోబరు 31వ తేదీ (గురువారం) అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెల‌వు ఉంటుంది. అయితే ప్ర‌భుత్వ‌,  ప్రైవేట్‌ ఆఫీస్‌ల‌కు మాత్రం కేవ‌లం ద‌స‌రా పండ‌గ రోజు మాత్ర‌మే... సెల‌వులు ఉండనున్న‌ది.

అక్టోబర్ 2వ తేదీ నుంచే..
తెలంగాణ‌లో భారీగా ద‌ర‌రా సెల‌వులు రానున్నాయి. తెలంగాణ‌లో బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి ఒకేసారి జ‌రుపుకుంటున్న విష‌యం తెల్సిందే. ఇక్క‌డ బతుకమ్మ, దసరా పండుగ‌ల‌ను అత్యంత ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఈ మేరకు తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అనగా 12 రోజులు హలీడేస్‌ రానున్నాయి. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో దసరా సెలవులు తక్కువగా ఉండనున్నాయి. ఈ సెలవులు ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలలకు సమానంగా వర్తిస్తాయి. ఈ మేర‌కు అకాడమిక్‌ క్యాలెండర్‌లో దీనిపై ప్రకటన చేశారు. ఈ నెల‌లోనే మ‌రో పండ‌గ దీపావళి అక్టోబరు 31వ తేదీ (గురువారం) అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెల‌వు ఇచ్చిన విష‌యం తెల్సిందే.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

బ్యాంక్ సెల‌వులు ఇలా..
ప్రతి రోజు బ్యాంకుల్లో ఏదో ఒక పని ఉంటుంది. లావాదేవీలు, డిపాజిట్లు తదితర పనులు చేసుకుంటుంటారు. అయితే ప్రతి నెల రాగానే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో గమనించడం చాలా ముఖ్యం. దీని ద్వారా సమయం వృధా కాకుండా ఉంటుంది. ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. అక్టోబ‌ర్‌ నెలలో బ్యాంకులకు సెలవులు భారీగానే ఉండనున్నాయి. ఏకంగా సగం రోజుల పాటు అంటే 14 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి.

అక్టోబ‌ర్ నెల‌లో సెల‌వులు ఇలా...

➤☛ అక్టోబర్ 2వ తేదీ : గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. 
➤☛ అక్టోబర్ 3వ తేదీ : నవరాత్రి ప్రారంభం, మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా హర్యానా, రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు
➤☛ అక్టోబర్ 6వ తేదీ : ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెల‌వులు ఉంటుంది.
➤☛ అక్టోబర్ 10వ తేదీ : మహా సప్తమి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
➤☛ అక్టోబర్ 11వ తేదీ : మహానవమి సందర్భంగా ఏపీ, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
➤☛ అక్టోబర్ 12వ తేదీ : ఆయుధ పూజ, దసరా, రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
➤☛ అక్టోబర్ 13వ తేదీ : ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
➤☛ అక్టోబర్‌ 14వ తేదీ : దుర్గాపూజ (దస్సేన్‌), గాంగ్టక్‌ (సిక్కిం)
➤☛ అక్టోబర్‌ 16వ తేదీ : లక్ష్మీ పూజ, అగర్తల, కోల్‌కతా
➤☛ అక్టోబర్ 17వ తేదీ : వాల్మికి జయంతి సందర్భంగా అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్మూ
➤☛ అక్టోబర్ 20: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
➤☛ అక్టోబర్ 26: నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు బంద్‌ (విలీన దినం- జమ్మూఅండ్‌ కశ్మీర్‌)
➤☛ అక్టోబర్ 27: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
➤☛ అక్టోబర్ 31: దీపావళి కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

రానున్న అక్టోబ‌ర్ నెల‌లో విద్యార్థులు.. వీరి కుటుంబ స‌భ్యులు సొంత ఊర్ల‌కు.. లేదా ఏదైన టూర్‌కి వెళ్లే వారు ఇప్ప‌టికే ఈ సెల‌వుల ప్ర‌కారం ప్లాన్ చేసుకుంటున్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే..
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
➤☛ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 26 Sep 2024 08:43AM

Photo Stories