Skip to main content

Food Poison At Gurukul School: గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌.. బాలికలకు అస్వస్థత

సాక్షి, అల్లూరి: పాడేరులోని గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Food Poison At Gurukul School
Food Poison At Gurukul School

వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా పాడేరులోని గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారి పరిస్థితి సీరియస్‌గా మారడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Students Debarred: డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో 13 మంది డిబార్‌

Food poison for school and college students in Nuzvid and Eluru

తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులను చూసి వారి పేరెంట్స్‌ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మెగా పేరెంట్ టీచర్స్ మీట్‌లో మిగిలిపోయిన వంటకాలను గురుకుల సిబ్బంది మరుసటి రోజు వడ్డించినట్టు సమాచారం. దీని వల్లే వారు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. 

Anganwadi Jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

 

Published date : 12 Dec 2024 04:10PM

Photo Stories