Skip to main content

6th/7th/8th/9th Class Admissions: ఏపీ బీసీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయవాడలోని మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2025–26విద్యా సంవత్సరానికి సంబంధించి (6, 7, 8, 9వ తరగతుల)లో మిగిలి ఉన్న బ్యాక్‌లాగ్‌ ఖాళీ­ల ప్రవేశాలకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
MJPAPBC Backlog Admission Notification 2025  Admission notification for BC, SC, ST, and EBC students in AP Gurukul schools  AP Gurukul schools admission notice for 2025-26 academic year   Application open for BC, SC, ST, and EBC students in Vijayawada

అర్హత: ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2025–26 విద్యా సంవత్సరంలో చేరాలనుకుంటే తరగతికి ముందు ఉండే తరగతి 2024–25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. ఉదాహరణకు ఆరో తరగతి ప్రవేశానికి ఐదో తరగతి చదువుతూ ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.
ప్రవేశ పరీక్ష: ప్రవేశపరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో  ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు తెలుగు,గణితం, ఈవీఎస్‌ సబ్జెక్టుల నుంచి ప్ర­శ్నలు వస్తాయి. మిగతా అన్ని తరగతుల్లో ప్రవే శాలకు తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ ప­రీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ(అనాథ/మత్స్యకార)ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.03.2025.
ప్రవేశ పరీక్ష తేది: 28.04.2025.
వెబ్‌సైట్‌: https://mjpapbcwreis.apcfss.in 

>> బీసీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు.. 6,600 సీట్లు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Current Affairs
Published date : 22 Feb 2025 03:21PM

Photo Stories