Skip to main content

Free Education: డా.బీఆర్‌ అంబేద్కర్‌ గురుకులాల్లో బీఆర్‌ఏజీ సెట్‌–2025.. ఎంపిక విధానం ఇలా!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలో డా.బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల విద్యాలయాలు, డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఐఐటీ–నీట్‌ కోచింగ్‌ సెంటర్లలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, జూనియర్‌ ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు బీఆర్‌ఏజీసెట్‌–2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితోపాటు క్రీడలు/వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు.
APSWREIS BRAG CET 2025 Exam

అర్హత: ఐదో తరగతికి జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023–24 విద్యా సంవత్సరంలో మూడో తరగతి, 2024–25 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి పూర్తిచేసి ఉండాలి. 
జూనియర్‌ ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు సంబంధిత జిల్లాల్లో 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో  పూర్తిచేసి ఉండాలి.
ఐఐటీ నీట్‌ కోచింగ్‌ సెంటర్లలో ప్రవేశాలకు బీఆర్‌ఏజీ సెట్‌(జూనియర్‌ ఇంటర్‌) పరీక్ష మెరిట్‌ జాబితాలో ర్యాంక్‌ పొందిన విద్యార్థులు ఐఐటీ మెడికల్‌ అకాడమీల పరీక్షకు 1:3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు.
వయసు: ఐదో తరగతి ప్రవేశాలకు విద్యార్థి వయసు ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 01.09.2012 నుంచి 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి. ఓసీ/బీసీ/బీసీ–సి విద్యార్థులు 01.09.2014 నుంచి 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి. 
ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులు 31.08.2025 నాటికి 17 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సా«ధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
పరీక్ష విధానం: ఐదో తరగతి ప్రవేశాలకు మొత్తం 50 మార్కులకు–50 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఉంటాయి. తెలుగు(10 ప్రశ్నలు–10 మార్కులు), ఇంగ్లిష్‌(10 ప్రశ్నలు–10 మార్కులు), గణితం(15 ప్రశ్నలు–15 మార్కులు), ఈవీఎస్‌(15 ప్రశ్నలు–15 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 100 మార్కులకు–100 ప్రశ్నలు ఉంటాయి. గణితం (15 మార్కులు), ఫిజికల్‌ సైన్స్‌ (15 మార్కులు), బయలాజికల్‌/నేచురల్‌ సైన్స్‌ (15 మార్కులు), సామాజిక అధ్యయనాలు (10 మార్కులు), ఇంగ్లిష్‌ (15 మార్కులు), లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ ఆప్టిట్యూడ్‌ (30 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష సమయం 2.30 గంటలు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.03.2025
అడ్మిట్‌ కార్డ్‌ల జారీ తేది: 01.04.2025.
ఐదో తరగతి బీఆర్‌ఏజీ ప్రవేశ పరీక్ష: 06.04.2025.
జూనియర్‌ ఇంటర్‌ బీఆర్‌ఏజీ ప్రవేశ పరీక్ష: 06.04.2025.
ఐఐటీ–మెడికల్‌ కోచింగ్‌ సెంటర్ల ప్రవేశ పరీక్ష: 20.04.2025.
వెబ్‌సైట్‌: https://apbragcet.apcfss.in 

>> Navodaya Admissions Exams : ఈనెల 9 వ‌రకు న‌వోద‌య ప్ర‌వేశ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తుల గ‌డువు.. ఈ త‌ర‌గ‌తుల‌కే!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Current Affairs
Published date : 20 Feb 2025 03:33PM

Photo Stories