Free Education: గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఎనిమిదో తరగతి, ఇంటర్ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే!

మొత్తం సీట్ల సంఖ్య: 780.
సీట్ల వివరాలు: ఎనిమిదో తరగతి–180, ఇంటర్ (ఎంపీసీ)–300, ఇంటర్ (బైపీసీ)–300.
అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎనిమి దో తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ ప్రవేశ పరీక్షకు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.
పరీక్ష విధానం: ఎనిమిదో తరగతికి ఏడో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. తెలుగు(10 మార్కులు), ఇంగ్లిష్(10 మార్కులు), హిందీ(10 మార్కులు), మ్యాథ్స్ (20 మార్కులు), ఫిజికల్ సైన్స్(15 మార్కు లు), బయోసైన్స్(15 మార్కులు), సోషల్ స్టడీస్(20 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్‌కి పదో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇంగ్లిష్ (20 మార్కులు), మ్యాథ్స్(40 మార్కులు), ఫిజికల్ సైన్స్(20 మార్కులు), బయోసైన్స్ (20 మార్కులు) సబ్జెక్టుల నుంచిప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 02.03.2025.
ప్రవేశ పరీక్ష తేది: 09.03.2025.
వెబ్‌సైట్: https://twreiscet.apcfss.in
![]() ![]() |
![]() ![]() |