Skip to main content

Admissions: తెలంగాణ బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశాలు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే!

తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIS) 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, అనాథ బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.
Admissions in Telangana BC Gurukul Schools

అర్హత:

  • సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 లేదా 2023-24లో విద్యను అభ్యసించి ఉండాలి.
  • తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 మించకూడదు.

వయోపరిమితి:

  • 31.08.2025 నాటికి 6వ తరగతి – 12 ఏళ్లు, 7వ తరగతి – 13 ఏళ్లు, 8వ తరగతి – 14 ఏళ్లు, 9వ తరగతి – 15 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం:

  • ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి.
  • పరీక్షలో మొత్తం 100 మార్కులు ఉంటాయి.
  • తెలుగు (15), లెక్కలు (30), సామాన్య శాస్త్రం (15), సాంఘిక శాస్త్రం (15), ఇంగ్లీష్ (25) నుంచి ప్రశ్నలు వస్తాయి.

పరీక్షతేది: 20.04.2025
హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 15.04.2025
దరఖాస్తు చివరి తేదీ: 31.03.2025
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
అధికారిక వెబ్‌సైట్: mjptbcwreis.telangana.gov.in
>> KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక ప్రవేశాలు.. పరీక్ష లేకుండా ప్రవేశాలు!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 21 Mar 2025 11:00AM

Photo Stories