Athletics Championship: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ విజేతలు వీరే..
Sakshi Education
ఒడిశా వేదికగా జరుగుతున్న 39వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన థోలెం శ్రీతేజ రజత పతకం సాధించింది.
భద్రాచలం పట్టణానికి చెందిన శ్రీతేజ అండర్-18 మహిళల హెప్టా థ్లాన్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్లింప్, జావెలిన్ త్రో, 1000 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో శ్రీతేజ మొత్తం 5087 పాయింట్లు స్కోరు చేసి రన్నరప్‌గా నిలిచింది.
హరియాణాకు చెందిన పూజా (5102 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని.. ఖుషీ (4350 పాయింట్లు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ అథ్లెట్లు నైని శ్రీకాంత్, అప్పాల వరుణ్, థోలెం శ్రీతేజ అదరగొట్టారు. పెంటాథ్లాన్ ఈవెంట్‌లో శ్రీకాంత్ 3905 పాయింట్లతో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పుతూ పసిడి పతకం దక్కించుకోగా, వరుణ్ 3856 పాయింట్లతో రజతం కైవసం చేసుకున్నాడు.
Hockey Junior Asia Cup: ఐదోసారి ఆసియా కప్ టైటిల్ నెగ్గిన టీమిండియా
Published date : 11 Dec 2024 06:49PM