Noida Airport: జెవార్ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్..!
ఇది విమానాశ్రయ ‘ఏరోడ్రోమ్ లైసెన్స్’ పొందే ప్రక్రియలో కీలక ఘట్టంగా నిలిచింది. కేంద్ర పౌరవిమానయాన మంత్రి కే రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో, ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ320 విమానం నోయిడా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.
ఈ విమానంలో కేవలం విమాన సిబ్బంది మాత్రమే ప్రయాణించారు. విమానాశ్రయ విధానాలు, దిశలను చూపించే వ్యవస్థలు, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలను పరీక్షించారు. విమానాశ్రయానికి అవసరమైన భద్రతా, నిర్వహణ ప్రమాణాలను సరిచూసుకున్నామని, త్వరలో డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ అవియేషన్)కి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటామని అధికారులు తెలిపారు.
Pamban Bridge: ఇంజినీరింగ్ అద్భుతం.. అధునాతన సాంకేతికతతో కొత్త రైల్వే బ్రిడ్జి
ఈ కొత్త ఎయిర్‌పోర్టు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జెవార్‌లో ఉంది. అధునాతన హంగులు, సదుపాయాలతో రెడీ అవుతున్న ఈ ఎయిర్‌పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.