Guinness Record: గీతా పారాయణ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు
Sakshi Education
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భోపాల్, ఉజ్జయిని నగరాల్లో నిర్వహించిన గీతా పారాయణ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.
ఈ కార్యక్రమం డిసెంబర్ 11వ తేదీ గీతా జయంతి సందర్భంగా లాల్ పరేడ్ మైదానం వేదికగా నిర్వహించబడింది. ఈ గీతా పారాయణానికి 5,000 మందికి పైగా భక్తులు హాజరై, భగవద్గీతను పఠించి ఈ గిన్నిస్ రికార్డును సృష్టించారు.
ఈ భగవద్గీత పారాయణ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరయ్యారు. ప్రభుత్వ, సాంస్కృతిక శాఖలు గీతా జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు హర్షం వ్యక్తం చేశారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో గీతాభవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని గోశాలాలను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది జరిగే అంతర్జాతీయ గీతా మహోత్సవ్‌లో మధ్యప్రదేశ్‌ను భాగస్వామిగా చేయాలని సీఎం సూచించారు.
Gita Jayanthi: నేడు గీతా జయంతి.. ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున..
Published date : 11 Dec 2024 06:26PM