Indira Gandhi Peace Prize: చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరా గాంధీ శాంతి బహుమతి
Sakshi Education
ప్రముఖ మానవ హక్కుల నేత, చిలీ మాజీ దేశాధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్‌కు 2024 సంవత్సరానికి చెందిన ఇందిరాగాంధీ శాంతి బహుమతిని అందుకోనున్నారు.
ఇందిరా గాంధీ శాంతి బహుమతి అంతర్జాతీయ జ్యూరీ చైర్మన్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ డిసెంబర్ 6వ తేదీ ఈ విషయం ప్రకటించారు.
ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం పాటుపడే వారిని ఈ అవార్డుతో గౌరవిస్తారు. ఐరాస మహిళా విభాగం వ్యవస్థాపక డైరెక్టర్‌గా, ఐరాస మానవ హక్కుల హై కమిషనర్‌గా, చిలీ అధ్యక్షురాలిగా లింగ సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం స్వదేశంలో, అంతర్జాతీయంగా మిచెల్ ఎంతగానో కృషి చేశారని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ పేర్కొంది.
Narendra Modi: మోదీకి గయానా, డొమినికా దేశాల అత్యున్నత పురస్కారాలు
Published date : 07 Dec 2024 01:13PM