Samagra Shiksha: ఏపీకి సమగ్ర శిక్షా అభియాన్ జాతీయ అవార్డు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమగ్ర శిక్షా అభియాన్ (SSAE)కు జాతీయ అవార్డు లభించింది.
ఈ అవార్డు దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన పెంపొందించడం, దివ్యాంగులకు సంబంధించిన పథకాల అమలులో విశేష ప్రతిఫలాలను సాధించడాన్ని గుర్తించి అందజేశారు.
ఈ అవార్డును 2024 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంలో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు అందుకున్నారు.
ఈ పురస్కారం కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వశాఖ, దివ్యాంగుల సాధికారత విభాగం (దివ్యాంగుల జన్) ఆధ్వర్యంలో నిర్వహించిన 'దివ్యాంగుల సాధికారత జాతీయ అవార్డులు-2024' కార్యక్రమంలో ఉత్తమ రాష్ట్రం కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రదానం చేశారు.
Published date : 04 Dec 2024 07:19PM