Baggy Green Cap: ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ ధర రూ.2 కోట్ల 12 లక్షలు!
1947–48లో భారత్‌తో ఆడిన సిరీస్‌లో బ్రాడ్‌మన్ ధరించిన ఈ క్యాప్, స్వదేశంలో ఆయన ఆడిన చివరి సిరీస్ కావడం విశేషం. ఆ ఐదు టెస్టుల్లో బ్రాడ్‌మన్ 4 సెంచరీలు సాధించి 715 పరుగులు చేయడం గొప్ప రికార్డు.
ఈ క్యాప్‌ను 2 లక్షల 50 వేల డాలర్లకు (సుమారు రూ.2.12 కోట్లు) ఒక క్రికెట్ ఫ్యాన్ సొంతం చేసుకున్నాడు. వేలం 10 నిమిషాలపాటు కొనసాగగా, చివరికి ఈ ధర పలికింది. క్యాప్ లోపలి భాగంలో బ్రాడ్‌మన్ పేరు రాసి ఉంది. ఈ టోపీ అనేక సంవత్సరాల క్రితం వాడి, రంగులు ఫెసిపోయినప్పటికీ, క్రికెట్ ప్రపంచంలో బ్రాడ్‌మన్ విలువను ఈ వేలం ధర ప్రతిబింబించింది.
Syed Modi International: మూడోసారి సయ్యద్ మోదీ ఛాంపియన్‌గా నిలిచిన భారత స్టార్
ఈ 'బ్యాగీ గ్రీన్' క్యాప్‌కు ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 1947-48 సిరీస్ ముగియగానే, బ్రాడ్‌మన్ ఈ క్యాప్‌ను భారత జట్టు మేనేజర్ పంకజ్ గుప్తాకు బహుమతిగా ఇచ్చారు. భారత జట్టు వికెట్ కీపర్ అయిన ప్రబీర్ కుమార్ సేన్‌కి ఈ క్యాప్ చివరికి ఇచ్చారు. 77 సంవత్సరాల తర్వాత, ఈ ప్రతిష్టాత్మక క్యాప్ వేలం ద్వారా కొత్త యజమానికి చేరింది.