Anemia: ఏపీలో 58.8% మహిళలకు రక్తహీనత
ఈ సంఖ్య జాతీయంగా 57% ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు.
ఏపీలోని మహిళల్లో ఆహారపు అలవాట్లు, విటమిన్ సీ తగినంతగా తీసుకోకపోవడం కారణంగా రక్తహీనత ఎక్కువగా ఉందని వివరించారు. సూక్ష్మ పోషకాల అవసరాలు తీర్చేందుకు, మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను నియంత్రించేందుకు అంగన్వాడీ కేంద్రాలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.
2024 మార్చికి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీలో ఏపీ 100% కవరేజీ సాధించిందని, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనలో భాగంగా ఏపీలో 1.32 కోట్ల మంది మహిళలకు బలవర్ధక బియ్యం అందించినట్లు తెలిపారు.
ఏపీలో 13,280 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తైంది
దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 3.16 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి అయ్యిందని పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ లలన్‌సింగ్ తెలిపారు. వీటిలోని ఏపీలో 13,280 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. డిసెంబర్ 3వ తేదీ లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
GST Collections: ఏపీలో క్షీణించిన జీఎస్టీ వసూళ్లు! దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో..
అలాగే, దేశ వారసత్వాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఏక్తా మాల్ ఒకటి ఏపీకి మంజూరు చేసినట్లు ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల సహాయ మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వకంగా బదులిచ్చారు. కాగా, ఏపీలో 18,913 మంది మహిళా పోలీసులు ఉన్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఎంపీ తనుజా రాణి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
కడప స్టీల్‌ప్లాంట్ అంశం మా ముందు లేదు
కడప స్టీల్‌ప్లాంట్ అంశం తమ వద్ద లేదని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో విభజన చట్టంలో కడప స్టీల్‌ప్లాంట్ హామీ ఉందని, దీని ఏర్పాటుపై కేంద్రం ఏం చేస్తుందని ఎంపీ బాలశౌరి ప్రశ్నించగా పై విధంగా మంత్రి బదులిచ్చారు.
‘దిశ’ను రాష్ట్రపతి అనుమతికి స్వీకరించారు: కేంద్రం
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన ‘దిశ’చట్టం రాష్ట్రపతి పరిశీలనకు అనుమతి కోసం స్వీకరించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ‘దిశ’ఏ దశలో ఉందని ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించగా.. కేంద్ర మంత్రి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘దిశబిల్లు–2019’ సవరణల తర్వాత కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. సవరణ చేసిన ఈ బిల్లు రాష్ట్రపతి పరిశీలనకు అనుమతించారని తెలిపారు.
Andhra Pradesh: గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నంబర్‌వన్.. అలాగే వీటి ఉత్పత్తిలోనూ..
చట్ట ప్రకారం.. రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రాల నుంచి స్వీకరించబడిన బిల్లులు నోడల్ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లతో సంప్రదించి తదుపరి ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అన్ని నోడల్ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్ల వారి సలహాలు, సూచనలు స్వీకరించారని తెలిపారు. మహిళా భద్రతా విభాగం, హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలను మరింత స్పష్టత కోసం ఏపీ ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు.