PAN 2.0 Project Benefits: ఇక నుంచి పాన్, టాన్ సర్వీసులన్నీ.. ఒకే ప్లాట్‌ఫాంలోనే..
ఆదాయపు పన్ను శాఖవారు.. అత్యంత ముఖ్యమైనదైన.. అనువైనదైన.. అవసరమైనదైన అడుగువేశారు. ఇక నుంచి పాన్.. అంటే పర్మనెంట్ అకౌంట్ నంబరు, టాన్.. అంటే టాక్స్ నంబరుకి సంబంధించి అన్ని సర్వీసులు ఒకే గూటి కింద ఉంటాయి. వివిధ ప్లాట్‌ఫాంలకు వెళ్లడం ఉండదు.
పాత పద్ధతికి స్వస్తి పలికారు. త్వరితగతి విధానం.. పేపర్ సహాయం లేకుండా ఉండటం, ఈ మార్పులన్నీ మనకు అనుగుణంగానే కాకుండా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. పాన్‌కి దరఖాస్తు చేయడం, వాటిలో సమాచారం అప్‌డేట్ చేయడం, ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం.. ఈ మూడింటిని మూడు ప్లాట్‌ఫాంల మీద చేయాల్సి వచ్చేది. ఇకనుంచి మూడూ ఒకే ప్లాట్‌ఫాం మీద చేయొచ్చు. అదే.. పాన్ 2.0 ప్రాజెక్టు.
వివరాల్లోకి వెళితే..
- ఇక నుంచి పాన్, టాన్, రెండూ ఒకే ప్లాట్‌ఫాంలో ఉంటాయి.
- ఇది వరకులాగా మూడు ప్లాట్‌ఫాంలకు వెళ్లనక్కర్లేదు.
- అనేక వెబ్‌సైట్లను సందర్శించనక్కర్లేదు.
- కాలం వృధా కాదు.. శ్రమ తక్కువ.
- క్షణాల మీద వేలిడేషన్ జరుగుతుంది.
- సెక్యూరిటీ పెరుగుతుంది.
- మోసాలను తగ్గించవచ్చు.
- అన్ని సర్వీసులు ఉచితం.
- ఫిజికల్ కార్డు కావాలంటే రూ.50 చెల్లించాలి.
- ఈ–పాన్‌ను మీ మెయిల్‌కి పంపుతారు. తక్షణం అందినట్లు లెక్క. లేటు ఉండదు.
- వివిధ ఫిర్యాదులకు చెక్ పెట్టినట్లు అవుతుంది.
- యాక్సెసబిలిటీ.. అంటే.. అందుబాటులో ఉంటుంది.
- డాక్యుమెంట్లు అవసరం లేదు.
- ఈ–పాన్ వల్ల డూప్లికేట్ కార్డులను ఏరిపారేయొచ్చు.
- డూప్లికేట్ కార్డుల వల్ల జరిగే మోసాలను అరికట్టవచ్చు.
- ఈ–పాన్ ఇక నుంచి యూనివర్సల్ ఐడెంటిటీ కార్డుగా చలామణీ అవుతుంది.
- అటు అసెసీలకు, ఇటు వృత్తి నిపుణులకు శ్రమ తగ్గుతుంది. కాలం వృధా కాదు.
- సెంట్రలైజ్డ్, సింగిల్ విండో విధానం వల్ల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించగలరు.
Immuno-Oncology Drug: భారత్‌లో తొలిసారి.. క్యాన్సర్‌కు కొత్త మందు
చివరగా ఇప్పుడున్న పద్ధతిలో డూప్లికేట్ కార్డుల వల్ల మోసాలు జరుగుతున్నాయి. రుణ సౌకర్యం, క్రెడిట్ కార్డులు పొందటం, ఒకే వ్యక్తి మరో వ్యక్తిగా చలామణీ అవడం.. వేరే అవతారమెత్తడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. పాన్, ఆధార్ కార్డు అనుసంధానం జరిగినప్పటికీ మోసాల వెల్లువ తగ్గలేదు.
ఒక సమాచారం ప్రకారం.. 780 మిలియన్లు అంటే 78 కోట్ల మందికి పాన్ కార్డులున్నాయి. కానీ ఆధార్ కార్డులు దేశంలో 138 కోట్ల మందికి ఉన్నాయి. ఆధార్ కార్డున్న ప్రతి వ్యక్తి అసెస్సీ కానక్కర్లేదు. ఆదాయపు పన్ను పరిధిలోకి రానవసరం లేదు.. రారు. 78 కోట్ల మంది పాన్‌హోల్డర్లు ఆధార్ కార్డుతో అనుసంధానం అయితే మోసాలు తగ్గుతాయి. అయితే, ఇందులో డూప్లికేట్ కార్డులు ఎన్ని ఉన్నాయో అంచనా తెలీదు.
కానీ చాలా ఏజెన్సీలు.. ప్రకటనల ద్వారా ఊరించి.. యాప్‌ల ద్వారా జనాలను ఆకట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాన్ 2.0 ప్రాజెక్టు మోసాలను అరికట్టేలా అడుగువేస్తుందని ఆశిద్దాం. మీరు వెంటనే అప్లై చేయనక్కర్లేదు. పాతవి కూడా కొత్త విధానంలో పని చేస్తాయి. మీరు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ సెలెక్ట్ చేసుకుంటే కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది ఈ–కార్డు.
PAN 2.0 Project: పాన్ 2.0 ప్రాజెక్ట్.. క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డులు