Skip to main content

Chess Championship: అండర్‌–9 జాతీయ చెస్‌ విజేత నిధీశ్

37వ జాతీయ అండర్‌–9 చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ చిన్నారులు నిదీశ్‌ శ్యామల్, అదుళ్ల దివిత్‌ రెడ్డి అదరగొట్టారు.
Under 9 Open National Chess Championship

జ‌న‌వ‌రి 2వ తేదీ ముగిసిన ఈ టోర్నీలో ఓపెన్‌ విభాగంలో నిధీశ్‌ చాంపియన్‌గా అవతరించగా.. దివిత్‌ రెడ్డి మూడో స్థానాన్ని సంపాదించాడు. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో నిదీశ్, ఆరిత్‌ కపిల్‌ (ఢిల్లీ) 9.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా.. నిదీశ్‌కు టైటిల్‌ ఖరారైంది. 

ఆరిత్‌ రన్నరప్‌గా నిలిచాడు. 9 పాయింట్లతో దివిత్‌ రెడ్డి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది వరల్డ్‌ క్యాడెట్‌ అండర్‌–8 చాంపియన్‌షిప్‌లో దివిత్‌ రెడ్డి స్వర్ణ పతకం గెలిచాడు. విజేతగా నిలిచిన నిధీశ్‌కు విన్నర్స్‌ ట్రోఫీతోపాటు రూ.50 వేలు ప్రైజ్‌మనీ లభించింది. జాతీయ చాంపియన్‌ హోదాలో నిదీశ్‌ ఈ ఏడాది జరిగే ప్రపంచ, ఆసియా అండర్‌–9 చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు.  

Khel Ratna, Arjuna Award Winners: నలుగురికి ఖేల్‌ రత్న, 32 మందికి అర్జున అవార్డులు.. అవార్డు గ్రహీతలు వీరే..

Published date : 04 Jan 2025 10:35AM

Photo Stories