Skip to main content

New Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. అక్కడ 300 కొత్త లోకల్‌ రైళ్లు.. మెగా టెర్మినల్‌..!

ముంబై రైల్వే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం భారీ పథకాలకు ఆమోదం తెలిపింది.
Blueprint of Mumbai railway expansion plans   Railways Announces 300 New Local Trains For Mumbai  New Mumbai local trains announcement

ఇందులో భాగంగా 300 కొత్త అదనపు లోకల్‌ రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు వసాయ్‌లో భారీ రైల్వే టెర్మినల్‌ను నిర్మించనున్నట్లు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ వెల్లడించారు. 

ప్రస్తుతం ముంబై సెంట్రల్‌ అలాగే వెస్ట్రన్‌ సబర్బన్‌ రైల్వే లైన్లలో ప్రతిరోజు 3,200 రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో సెంట్రల్‌ రైల్వేలో 40 లక్షల మంది, పశ్చిమ రైల్వేలో 35 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే, భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి కొత్త లోకల్‌ రైళ్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.   

వసాయ్‌లో మెగా టెర్మినల్‌    
ముంబై రైల్వే హబ్‌లపై ఉన్న భారాన్ని తగ్గించేందుకు వసాయ్‌ ప్రాంతంలో ఒక మెగా రైల్వే టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది సబర్బన్‌ అలాగే సుదూర రైళ్లకు సర్వీసులు అందించడమే కాకుండా, ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.   

Pamban Bridge: ఇంజినీరింగ్‌ అద్భుతం.. అధునాతన సాంకేతికతతో కొత్త రైల్వే బ్రిడ్జి

ముఖ్యమైన ఇతర అభివద్ధి పథకాలు.. 
తూర్పు భారతదేశంతో కనెక్టివిటీ: ముంబై పోర్ట్‌ కనెక్టివిటీ మెరుగుపరచడానికి ప్రత్యేక కారిడార్‌ను రూపొందించనున్నారు.  
కీలక టెర్మినల్స్‌: విస్తరణ: పరేల్, ఎల్‌టీటీ, కల్యాణ్, పన్వేల్ టెర్మినల్స్‌ సామర్థ్యాన్ని పెంచి ప్రయాణికుల అవసరాలను తీర్చనున్నారు.   
సెంట్రల్‌ అలాగే బాంద్రా టెర్మినల్స్‌: అభివృద్ధి: పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ హబ్‌ల సామర్థ్యాన్ని విస్తరించనున్నారు.   
జోగేశ్వరి, వసాయ్‌ టెర్మినల్స్‌: ఈ కొత్త టెర్మినల్స్‌ సబర్బన్‌ ప్రయాణాలను మరింత సులభతరం చేయనున్నాయి.  

వచ్చే ఐదేళ్లలోపు పూర్తి కానున్న ఈ ప్రాజెక్టులు ముంబై నగరానికి రైల్వే కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి దోహదపడతాయి. ఈ అభివృద్ధి లక్షలాది మంది ప్రజల జీవన ప్రమాణా లను మెరుగుపరచడంతో పాటు ముంబైని తూర్పు రాష్ట్రాలకు మరింత సమీపంగా తీసుకువస్తాయి.

ఈ చర్యలు ముంబై మహానగరాన్ని ఒక శక్తివంతమైన రైల్వే కేంద్రంగా మార్చడమే కాకుండా, ప్రజల కోసం మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Greenfield Highway: ఏపీలో మరో గ్రీన్‌ ఫీల్డ్ హైవే.. ఈ హైవే ప్రధాన అంశాలివే..

Published date : 03 Dec 2024 09:31AM

Photo Stories