Pamban Bridge: ఇంజినీరింగ్ అద్భుతం.. అధునాతన సాంకేతికతతో పాంబన్ రైల్వే వంతెన నిర్మాణం
ఈ వంతెన దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రూపొందుతుంది. ఆధునిక సాంకేతికత జోడించి నిర్మించిన ఈ వంతెన ఇంజినీరింగ్ అద్భుతమని, దేశ అభివృద్ధికి సంకేతమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభివర్ణించారు.
వంతెన నిర్మాణ వివరాలు..
➣ 1914లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన పాంబన్ బ్రిడ్జి 105 సంవత్సరాలు సేవలందించిన తర్వాత పగుళ్లు రావడం వల్ల ఆ వంతెన పనికి రాలేదు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ పాత వంతెనకు సమాంతరంగా కొత్త వంతెన నిర్మించడానికి శంకుస్థాపన చేశారు.
➣ రూ.535 కోట్ల వ్యయంతో సాగర జలాలపై సుమారు 2 కి.మీ. పొడవున ఈ కొత్త వంతెన నిర్మించబడింది.
Immuno-Oncology Drug: భారత్‌లో తొలిసారి.. క్యాన్సర్‌కు కొత్త మందు
➣ ఈ వంతెన యొక్క ప్రత్యేకత, మధ్యలో 77 మీటర్ల ఎత్తు, 650 టన్నుల బరువున్న వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి. ఈ లిఫ్ట్ బ్రిడ్జి ఓడలు, పడవలు రాకపోకలకు ఎటు వచ్చినా అడ్డంకి లేకుండా పని చేస్తుంది. ఓడలు లేదా పడవలు వంతెన క్రింద పోతే, బ్రిడ్జి లిఫ్ట్ తీసుకుని పైకి లేస్తుంది. తిరిగి పడవలు వెళ్లిపోగానే బ్రిడ్జి కిందకు దిగిపోతుంది. తద్వారా రైలు సాగే మార్గం అందిస్తుంది.
పాత వంతెన వివరాలు..
➣ పాత పాంబన్ బ్రిడ్జి 1914లో రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది.
➣ 2006-07లో ఈ వంతెనను మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌కి మరింత ఆధునికీకరించారు.
➣ పాత వంతెనలో పడవలు, షిప్‌లు వెళ్లేందుకు 16 మంది కార్మికులు విధుల్లో ఉండాల్సి వచ్చేది. కానీ ఆ వంతెన క్రమంగా తుప్పు పట్టడంతో, దాని సేవలు నిలిచిపోయాయి.
PAN 2.0 Project: పాన్ 2.0 ప్రాజెక్ట్.. క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డులు