HIV Cases: హెచ్‌ఐవీ రోగుల్లో రెండో స్థానంలో ఉన్న ఏపీ
నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్‌టీడీ కంట్రోల్ ప్రోగ్రాం కింద 2,22,338 మంది రోగులు రాష్ట్రంలో చికిత్స పొందుతున్నారు. ఇందులో పురుషులు 99,455, మహిళలు 1,22,124, ట్రాన్స్‌జెండర్లు 759 మంది ఉన్నారు.
ఈ విషయంలో మహారాష్ట్ర (2,39,797) ముందు నిలిచింది. దేశవ్యాప్తంగా 16,88,925 మంది హెచ్‌ఐవీ రోగులు చికిత్స పొందుతుండగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వాటా 27.36% గా ఉంది. తెలంగాణలో ఈ సంఖ్య 1,03,933కు పరిమితమైంది. 2019-20లో ఏపీలో 1,92,693 మంది రోగులు చికిత్స పొందుతుండగా, 2023-24 నాటికి ఈ సంఖ్య 2,22,338 (15.38%)కి పెరిగింది. దేశవ్యాప్తంగా 22.37% పెరుగుదల నమోదైంది.
Andhra Pradesh: గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నంబర్‌వన్.. అలాగే వీటి ఉత్పత్తిలోనూ..
డాక్టర్ల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో..
ఆంధ్రప్రదేశ్‌లో 1,05,805 మంది డాక్టర్లు దేశంలో మూడో స్థానంలో ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. తమిళనాడు (1,49,399) మరియు కర్ణాటక (1,41,155) తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కౌన్సిళ్లలో 13,86,145 మంది డాక్టర్లు నమోదుకాగా, ఈ మూడు రాష్ట్రాల వాటా 29% గా ఉంది.
Panchayati Raj Institution: పంచాయతీరాజ్ సంస్థల రాబడుల్లో ఏపీ భారీ వృద్ధి.. గత ఐదేళ్లలో..